ఏపీలో ఆ జిల్లాల రైతులకు మోదీ దీపావళి ధమాకా.. ప్రతి యేటా రూ.160 కోట్లు!

దీపావళి పండుగకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ఆ జిల్లాల రైతులకు ప్రతి సంవత్సరం వ్యవసాయానికి తోడ్పాటు అందించేలా 40 కోట్ల రూపాయలను ఒక్కో జిల్లాకు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్రం తాజాగా మరో పథకం ద్వారా వారికి వెన్నుదన్నుగా నిలవనుంది.

వెనుకబడిన 100 జిల్లాలకు మోదీ వరం
ఈరోజు ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల రైతులకు శుభవార్త చెప్పింది.
వ్యవసాయాన్ని మరింత సుస్థిరం చేయాలని లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంబించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు.

Modi Diwali gift to farmers in those districts in AP Rs 40 crore every year

తెలంగాణా, ఏపీ నుండి ఈ జిల్లాల రైతులకు లబ్ది
తెలంగాణా నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, జనగామ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎంపికైన ప్రతి జిల్లాకు ఆరేళ్లలో ప్రతీ ఏటా 40 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయి. నాలుగు జిల్లాలకు 160కోట్లు అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అన్నమయ్య జిల్లాలను ధన ధాన్య కృషి యోజన పథకానికి ఎంపిక చేశారు.

వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు చర్యలు
ఈ పథకంలో భాగంగా వ్యవసాయ ఉత్పాదకత పెంచడం కోసం చర్యలు చేపడతారు. వ్యవసాయం లాభసాటిగా చేయడానికి అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించడం, పంట మార్పిడి విధానాలను అనుసరించడం, పంటల మళ్లింపు వంటి అనేక నిర్ణయాలను తీసుకుంటారు. రైతులకు ఉపయోగపడేలా సులభంగా రుణాలను అందేలా చూడడంతో పాటు, వారి అభ్యున్నతికి అధికార యంత్రాంగం బాసటగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని భావిస్తున్నారు.

ఏపీలో నాలుగు జిల్లాల రైతులకు లబ్ధి
ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్ గా ఉండి ఎప్పటికప్పుడు అమలుతీరును పర్యవేక్షిస్తారు. అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తారు. ఈ పథకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నాలుగు జిల్లాల రైతులకు లబ్ధి జరుగుతుందని, ఇక్కడ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. మోడీ ఇచ్చిన వరంతో ఏపీలోని నాలుగు జిల్లాల రైతులు దీపావళి కంటే ముందే పండగ చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+