వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల కోసం మోడీ సర్కార్ మరో నిర్ణయం .. పావలా వడ్డీకే రుణాలు

|
Google Oneindia TeluguNews

రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్రమోడీ . రైతుల సంక్షేమం కోసం కిసాన్ భీమా , కిసాన్ సమ్మాన్ నిధి వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మోదీ సర్కార్ తాజాగా రైతులకు ప్రయోజనం కలిగించే నిర్ణయంతో రైతుల వ్యవసాయ అవసరాలు తీర్చనుంది. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం రైతులకు పావలా వడ్డీలకే రుణాలు ఇవ్వనుంది.

Recommended Video

3 Minutes 10 Headlines | World Wildlife Day 2020 | Modi Social Media Accounts Give Up | Oneindia

 సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్ సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

 తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకుల రుణాలు

తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకుల రుణాలు

రైతులకు భరోసా కల్పించేందుకు కిసాన్‌ క్రెడిట్‌కార్డు పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర సర్కార్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్నదాతలకు రుణాలు అందించనుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను రైతులకు అందించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రైతులకు బ్యాంకులు రుణాలు అందజేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌

కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌

వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడుల కోసం క్రాప్ లోన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. పంట రుణాల కోసం అధిక వడ్డీలను చెల్లించి అప్పుల భారం వేసుకుంటున్న రైతులకు వాటి నుండి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తెరమీదకు తెచ్చింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందే ప్రతి ఒక్క రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించి, కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించనుంది.

పావలా వడ్డీకే రైతన్నలకు రుణాలు

పావలా వడ్డీకే రైతన్నలకు రుణాలు

అది కూడా రైతులు గతంలో తీసుకున్న రుణాలను గడువులోపు కడితేనే ఈ పథకం వర్తిస్తుంది.ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి తనఖా లేకుండానే రూ1.6 లక్షల వరకు ఋణం తీసుకోవచ్చు . బ్యాంకులు రుణాలపై సాధారణ వడ్డీనే వసూలు చేస్తాయి. పావలా వడ్డీనే పడుతుంది. ఇక ఈ మొత్తాన్ని రైతులు సకాలంలో చెల్లించకపోతే అప్పుడు కాంపౌండింగ్ వడ్డీ పడుతుంది.

 కిసాన్ క్రెడిట్ కార్డుతో పంట భీమా సౌకర్యం

కిసాన్ క్రెడిట్ కార్డుతో పంట భీమా సౌకర్యం


కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద సులభంగా రుణాలు తీసుకోవడమే కాకుండా మరో లాభం కూడా లభిస్తుంది . కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న రుణంతో పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. కేసీసీ అకౌంట్‌‌లోని డబ్బులకు సేవింగ్స్ వడ్డీ రేటు కూడా వర్తిస్తుంది. మొత్తానికి వ్యవసాయ రుణాలకు పావలా వడ్డీకే కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్ రైతాంగానికి రుణ వెసులుబాటు కల్పిస్తుంది.

English summary
Central government's decision to give crop loans to farmers is good news for farmers. The central government has unveiled the Kisan Credit Card Scheme, which aims to relieve farmers from paying high interest rates on crop loans. The Kisan Credit Cards will be provided to every farmer who is eligible to benefit under the PM Kisan Scheme and will be able to borrow up to Rs 3 lakh on the Kisan Credit Card.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X