వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ పేరు మోదీ: నారా లోకేష్!
పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై నిన్న రాత్రి భారత సాయుధ దళాలు జరిపిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్లో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ ఆపరేషన్ నిర్వహించారు. సియాల్ కోట్లో ని సర్జాల్ క్యాంప్, పాకిస్తాన్లో బహవాల్ పూర్ లో మెహమూనా జోయా, మర్కజ్ తైబా మురిడికే, మర్కజ్ సుభానల్ల అనే ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు.
పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్
భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యూమిక సింగ్, ఆపరేషన్ సిందూర్ తాలూకు వివరాలు తెలియజేశారు. పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులు, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని వారు చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ సాగిందిలా
గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని, ఉగ్రవాదుల నియామకం, ఉగ్రవాద శిక్షణ మొదలైన వ్యవస్థలు పాకిస్తాన్లోనూ పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్లో వ్యాపించి ఉన్నాయని వారు తెలియజేశారు. సైనిక చర్య జరిపిన పద్ధతి, ధ్వంసం అయిన ఉగ్రవాద స్థావరాల వివరాలను, సైనిక, పౌర వ్యవస్థలకు ఎటువంటి నష్టం కలిగించకుండా జరిపిన ఆపరేషన్ గురించి వారు వివరించారు.
ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన మంత్రి నారా లోకేష్
భవిష్యత్తులో పాకిస్తాన్ తలపెట్టే ఎటువంటి దుష్ట కార్యానికైనా జవాబు ఇచ్చేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయని కూడా సోఫియా ఖురేషి తెలిపారు.
ఇదిలా ఉంటే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆపరేషన్ సింధూర్ పైన తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల అమరావతి సభలో తాను ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో చేసిన వీడియోను ఆయన నేడు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
భారతదేశంపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు అంటూ లోకేష్ భావోద్వేగం
ఇందులో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన తన అభిమానాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ గీత దాటింది. అమాయకులను చంపింది. చాలా పెద్ద తప్పు చేసింది. పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్ లు వచ్చిన భారతదేశంపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు అంటూ లోకేష్ భావోద్వేగంతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
మన నేల పై మొలిచిన మొక్క కూడా పీకలేరు! వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ పేరు మోదీ. #OperationSindoor #PahalgamTerrorAttack pic.twitter.com/dHVA5menie
— Lokesh Nara (@naralokesh) May 7, 2025
ఆ మిస్సైల్ మోదీ
100 పాకిస్తాన్ లకు సమాధానం చెప్పే ఒక మిస్సైల్ ఉంది ఆ మిస్సైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ .. అంటూ లోకేష్ భావోద్వేగంతో మాట్లాడారు ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన లోకేష్ ఆపరేషన్ సిద్దూర్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications