తెలుగు ప్రజలకు మోడీ, పవన్, జగన్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌/ న్యూడిల్లీ: తెలుగు ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరికీ సుఖ, సంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. ఆనందమయమైన రేపటికి ఈ సంక్రాంతి నాంది కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తెలుగు ట్వీట్ చేశారు.

తెలుగు ప్రజలకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణభారతం కావాలని ఈ సందర్భంగా పవన్‌ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

 Modi and Pawan Kalyan greet Telugu people on the occasion of Sankranthi

తెలుగు రాష్ట్ర్లాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆయన ఆశించారు. అన్నపూర్ణగా పేరు గాంచిన తెలుగు నేల పాడిపంటలకు నెలవు కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు విధివిధానాలను రూపొందించాలని ఆయన సూచించారు.

ఇదిలావుండగా, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి చిత్తూరు జిల్లాలోని తన సొంతూరు దిగువమాఘంలో సంక్రాంతి సంబరాలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈనాటి యువతకు తెలుగు సంప్రదాయాలు అంటే ఏమిటో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, కావున ఇలాంటి సంబరాలు జరుపుకోవడం ద్వారా వారికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటారని గల్లా అరుణ అన్నారు.

అలాగే కుటుంబ ఐక్యత పండుగ నాంది పలుకుతుందని, వేరే ఊర్లో నివసిస్తున్న బంధువులు అంతా పండగ సందర్భంగా ఒకచోటకు చేరుకుని సంబరాలు జరుపుకుంటురని గల్లా అరుణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+