మోడీకి కౌండ్‌డౌన్ ప్రారంభమైంది, రాజీనామాలు చేస్తే ఎవరు పోరాడుతారు: కేశినేని నాని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోందని టిడిపి ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఏపీ రాష్ట్రం నుండి పన్నుల రూపంలో కేంద్రానికి పెద్ద మొత్తంలో నిధులు వెళ్తే,రాష్ట్రానికి మాత్రం తక్కువ నిధులు ఇచ్చారని ఆయన చెప్పారు.మోడీ రాజకీయాలకు ఇక కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడాయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతోందని కేశినేని నాని చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు పెద్ద డ్రామాలని కేశినేని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ఆమరణ నిరహరదీక్షలను ప్రజలు ఎవరూ కూడ నమ్మడం లేదన్నారు.

Modis countdown started, says Tdp MP Kesineni Nani

ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగడం, లోక్‌సభ స్పీకర్‌ను ఘోరావ్ చేసిన చరిత్ర టిడిపిదేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి జరిగిన అన్యాయం విషయమై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన గుర్తు చేశారు.

మోడీ మార్క్ రాజకీయాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కేశినేని నాని అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీకి తన గురించి ప్రచారం చేసుకోవడం ఎక్కువ, పని చేయడం తక్కువని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని నాని చెప్పారు. తాము ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తే పార్లమెంట్‌లో ఎవరు పోరాటం చేస్తారని కేశినేని నాని ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijayawada MP Kesineni Nani said that the countdown has begun for Modi's politics. A Telugu channel interviewed him on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి