మోడీ గాలితో గెలిచారు: బాబుపై జగన్, అలా చేయలేనని
ఒంగోలు: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ గాలి వల్లే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గెలిచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన రెండు రోజుల ఒంగోలు పర్యటనలో భాగంగా మంగళవారం ఒంగోలు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండెపి నియోజకవర్గాల నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే తాను అధికారంలో ఉండేవాడినని అన్నారు. చంద్రబాబులా మోసం చేయలేనని వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తనకు కడపలో వచ్చి మెజార్టీనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం వచ్చిందని అన్నారు.

సోమవారం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అండగా నిలువాలని నాయకులు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమిద్దామని, ఇందులో భాగంగా డిసెంబర్ 5న ఏపిలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని అన్నారు.
తొలిరోజు సమీక్ష సమావేశంలో కందుకుూరు, అద్దంకి, సంతనూతలపాడు, చీరాల పర్చురు నియోజకవర్గాల నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. టిడిపి చేస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదిరిద్దామంటూ జగన్ పార్టీ కార్యకర్తలతో అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 30ఏళ్లపాటు ప్రజలకు గుర్తుండిపోయేలా పాలన అందించాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications