బాబు ప్రమాణానికి మోడీ నో: అద్వానీ, కేంద్ర మంత్రులు
హైదరాబాద్: గుంటూరులో ఈనెల 8న జరుగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడం లేదని ఆంధ్రప్రదేశ్ బిజెపి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ హాజరువుతారని సమాచారం.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, పీయూష్ గోయల్, ప్రకాష్‌జవదేకర్, నిర్మలా సీతారామన్, అనంతకుమార్, రవి శంకర్‌ప్రసాద్‌తో పాటు తమిళనాడు, గోవా, చత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌థాక్రే ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు తెలిపారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న ప్రముఖుల షెడ్యూల్ శుక్రవారం ఉదయం రెండు జిల్లాల అధికార యంత్రాగానికి అందినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. దేశవిదేశాల నుంచి 250 మంది అథితులు హాజరవుతారని సమాచారం.
ఆ రోజు రాత్రి అతిథులు విజయవాడలో కొందరు ముఖ్యమంత్రులు బస చేసే అవకాశం ఉండటంతో ఆయా ఏర్పాట్లలో కృష్ణా, గుంటూరు జిల్లా యంత్రాంగం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గుంటూరులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications