కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: టీడీపీలో చేరిన మరో ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేరారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ జానీ శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి: తెలుగుదేశం పార్టీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ చేరారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ జానీ శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు.. జానీకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, జానీ మద్దతుదారులు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు టీడీపీలో చేరగా, తాజాగా జానీ చేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications