Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవికి ‘పద్మ విభూషణ్’పై మోహన్ బాబు స్పందన

మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో చిరకాల స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా, చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్ రావడం పట్ల మోహన్ బాబు స్పందించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

'నా ప్రియ మిత్రుడు చిరంజీవికి అభినందనలు. ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాలా అర్హుడు. నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేమంతా ఎంతో గర్విస్తున్నాం' అని మోహన్ బాబు ట్విట్టర్(ఎక్స్) వేదికగా పేర్కొన్నారు. కాగా, చిరంజీవి పద్మవిభూషణ్ రావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు అభినందలు చెబుతున్నారు.

Mohan babu greets chiranjeevi for Padma Vibhushan award

వెంకయ్య నాయుడును కలిసిన చిరంజీవి

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్‌​లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌​కు వీరిద్దరూ ఎంపికైన విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా ఒకేరోజు ఇద్దరికీ పద్మవిభూషణ్ వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఆ ప్రత్యేక క్షణాలను మెగాస్టార్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

కాసేపు సరదాగా మాట్లాడుకొని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీవి, ఈ పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరూ ఇరువురికి ఉన్న గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

'జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు' అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత తాను సినిమాలలోకి వచ్చానని.. ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారయని మెగాస్టార్ చిరంజీవి‌ పేర్కొన్నారు. కొద్దికాలం తర్వాత మేమిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నాం. అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని. సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని చిరంజీవి వెల్లడించారు. వెంకయ్యనాయుడు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని.. ఆయనను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.

వెంకయ్యనాయుడుతో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్‌ రావటంతో తన ఆనందం ద్విగిణికృతమయిందన్నారు. ఇద్దరు తెలుగువాళ్లం.. స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్‌ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం' అని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు, చిరంజీవిపై వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ రెండు కళ్లు అయితే- చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఈ అవార్డు రావటానికి అన్ని అర్ఞతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒకో అడుగు వేసుకుంటూ- ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు' అని చిరంజీవిని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సరైన సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అని మెగాస్టార్‌ను ప్రశంసించి సత్కరించారు మాజీ ఉప రాష్ట్రపతి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+