నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్సర్ బైకుపై కోతుల మూక దాడి: యువతి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఓ బైకుపై కోతులు చేసిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్‌ఐ నారాయణ కథనం ప్రకారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన బొమ్మసాని చంద్రశేఖర్ తన సోదరి రమాదేవితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైందుకు పల్సర్ బైక్‌పై సికింద్రాపూర్‌కు బయలు దేరారు.

వీరు డిచ్‌పల్లి మండలం చంద్రాయన్‌పల్లి అటవీ శివారు ప్రాంతానికి చేరుకునేటప్పటికి ఓ కోతుల గుంపు రోడ్డు దాటుతోంది. బైకుపై ఎర్ర రంగులో ఉన్న బ్యాగును చూసి ఒక కోతి దానిపై దూకింది. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. వెనుక కూర్చున్న రమాదేవి తలకు తీవ్రగాయాలు కాగా, చంద్రశేఖర్ కుడి చేయి విరిగింది. వీరిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా రమాదేవి మార్గమధ్యలో మృతి చెందింది.

Nizamabad map

హత్య కేసులో రిమాండ్

ఇదిలావుంటే, బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు శివారులో ఈ నెల 11న అం జవ్వను హత్య చేసిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయనతెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండ లం ముదెల్లి పంచాయతీ పరిధి నర్సాపూర్‌ గ్రామానికి చెందిన అంజవ్వ(44)ను ఈ నెల 11న బాన్సువాడ మండలం సోమేశ్వర్‌ గ్రా మానికి చెందిన ఊశయ్య బోర్లం క్యాంపు గ్రామ శివారుకు తీసుకువెళ్లాడు. తెచ్చుకున్న కల్లు ఇద్దరు తాగారు. ఇతరులతో సంబంధాలు కొనసాగించవద్దని అంజవ్వతో ఊశయ్య అ న్నాడు. దీనికి ఇష్టమని చెప్పిన అంజవ్వను గొంతు నుమిలి, క్లచ్‌వైర్‌తో ఉరివేసి చంపాడని విచారణలో నిందితుడు పేర్కొన్నట్లు సీఐ తెలిపారు.

అంజవ్వ భర్త ఆరేళ్ల క్రితం చనిపోయాడ ని, ఆమెకు ముగ్గురు కొడుకులు ఉన్నారన్నారు. రెండేళ్ల క్రితం అంజవ్వ బతుకుదెరువు కోసం తన అత్తతో కలిసి కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌ గ్రామానికి వెళ్లింది. రెండు నెలల క్రితం అత్త చనిపోవడంతో తిరిగి నర్సాపూర్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఊశయ్యతో సంబంధాన్ని కొనసాగించిందని ఎస్‌హెచ్‌వో తెలిపారు. తనతో కాక వేరే వ్యక్తులతోనూ అంజవ్వ సంబంధాలు ఏర్పరుచుకుందని అనుమానించిన ఊశయ్య ఆమెను హత్య చేసినట్లు విచారణలో వెల్లడించాడని చెప్పారు. మృతురాలి సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుడిని సోమేశ్వర్‌ గ్రామంలో పట్టుకొని రి మాండ్‌కు పంపామన్నారు. కేసు ఛేదించిన ఎస్సై చంద్రశేఖర్‌, రాజశేఖర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ రవీందర్‌, కానిస్టేబుళ్లు జనారన్‌రెడ్డి, హరిచంద్‌, సంతోష్‌లను ఎస్‌హెచ్‌వో అభినందించారు.

భార్యను కొట్టి చంపిన భర్తకు..

మాక్లూర్‌ మండలంలోని మాదాపూర్‌కు చెందిన ఎర్రోల్ల గంగాధర్‌ అనే వ్యక్తిని హ త్య కేసులో మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపారు. నిందితు డు శుక్రవారం రాత్రి తన భార్య సంధ్యను కట్టెతో కొట్టి చంపినందుకు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్‌కు పంపినట్టు ఎస్సై పేర్కొన్నారు.

English summary
Monkies attacked on a pulsar bike, in which a woman dead in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X