జగన్ పార్టీలోకి మోపిదేవి: విభజనపై ఢిల్లీకి పార్టీ అధినేత

Mopidevi Venkataramana
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు.

జగన్ ఆస్తుల కేసులో మోపిదేవి వెంకటరమణ గత ఏడాది అరెస్టయ్యారు. ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. జగన్ కేసులో తనను జైలులో ఉన్నా కాంగ్రెసు పార్టీ అండగా నిలబడక పోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జూలై నెలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు, తనయుడు రాజీవ్, ఇతర నాయకులు చేరారు. తన సోదరుడిని తలుచుకొని హరనాథ బాబు ఓ సమయంలో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. జగన్ సమైక్యం కోసం జైలులో దీక్ష చేసినప్పుడు కూడా మోపిదేవి సంఘీభావం తెలిపారు.

ఢిల్లీకి జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు ముఖ్య నేతలను కలిసి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని కోరనున్నారు. జగన్‌తో పాటు పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+