భవిష్యత్ లో మరిన్ని చేరికలు ..ప్రతిపక్షమే ఉండదు : బాంబు పేల్చిన విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ మీద బాంబు పేల్చారు. భవిష్యత్ లో మరిన్ని చేరికలు ఉంటాయని ప్రకటించారు . అసలే అధికారం లేక , ప్రభుత్వం తో నిత్యం సమరం చేస్తున్న టీడీపీ నుండి ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీని వీడి వెళ్తున్నారు . ఈ సమయంలో భవిష్యత్ లో ప్రతిపక్షమే ఉండదు అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలను ఆలోచనలో పడేస్తున్నాయి. చంద్రబాబుకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా తయారయ్యాయి.
Recommended Video

వాసుపల్లి గణేష్ చేరిక తర్వాత విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన వాసుపల్లి గణేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. వాసుపల్లి గణేష్ తన ఇద్దరు కుమారులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేర్పించి జగన్ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. వాసుపల్లి గణేష్ కుమార్ లు వైసిపిలో చేరిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షం ఉంటే కదా .. ప్రతిపక్ష నాయకుడు ఉండేది
భవిష్యత్తులో ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రతిపక్ష నాయకుడు ఉండేది అంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తున్నాయి. భవిష్యత్తులో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ బాట పడతారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుటుంబం విశాఖ ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. వాసుపల్లి గణేష్ వైసీపీలోకి చేరడం పార్టీకి కొండంత బలంగా అభివర్ణించారు. విశాఖ జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా ఒకటే
భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమీ లేదంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో ఉన్న విద్యావంతులు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు . రాష్ట్రంలో భవిష్యత్ లో ప్రతిపక్షమే ఉండదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు . ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వాసుపల్లి గణేష్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు అంటూ పేర్కొన్నారు.

జగన్ గట్స్ ఉన్న నాయకుడన్న వాసుపల్లి గణేష్
వాసుపల్లి గణేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. వైయస్సార్సిపి లో తన కుమారులు చేరటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు అంటూ కొనియాడారు . విశాఖ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే అని వాసుపల్లి గణేష్ తెలిపారు. జగన్ ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు . ఇక భవిష్యత్తులో టిడిపి ముందుకు వస్తదని అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications