వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగ నేతలకు మరో ఇరకాటం-జగన్ సర్కార్ 800 కోట్ల విత్ డ్రాతో-సమాధానం చెప్పలేక..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదట్లో 27 శాతం ఐఆర్ ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తర్వాత పీఆర్సీ వ్యవహారం, సీపీఎస్ రద్దు కాకపోవడం వంటి సమస్యలతో వారి ఆగ్రహాన్ని చవిచూస్తోంది. అదే సమయంలో ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాల్సిన ఉద్యోగ నేతలు మిన్నకుండిపోతున్నారనే వాదన ఉద్యోగుల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు విత్ డ్రా కావడం వారిలో ఆగ్రహం నింపింది.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
ఉద్యోగులు వర్సెస్ ఉద్యోగ నేతలు

ఉద్యోగులు వర్సెస్ ఉద్యోగ నేతలు

ఏపీలో ఉద్యోగ సంఘాలకూ, వారిని ఎన్నుకున్న ఉద్యోగులకు మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం విధానాల కారణంగా నష్టపోతున్న ఉద్యోగులకు మద్దతుగా పనిచేయాల్సిన సంఘాలు ఇప్పుడు ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వెళ్లిపోయి తమకు నష్టం చేస్తున్నట్లు వారు భావిస్తున్నారు. ఇప్పటికే పీఆర్సీ సాధనలో కానీ, సీపీఎస్ రద్దు చేయించడంలో కానీ, ఇతరత్రా ముఖ్య సమస్యల పరిష్కారంలో విఫలమైన ఉద్యోగసంఘాల నేతలు.. ప్రభుత్వం చెప్తున్న ఆర్ధిక, సాంకేతిక కారణాలపై వారిని నచ్చజెప్పలేని పరిస్దితుల్లోకి జారిపోతున్నారు.

 ఇదే అదనుగా సర్కార్

ఇదే అదనుగా సర్కార్

ఏప్పుడైతే ఉద్యోగసంఘాల నేతల్ని చెబ్పుచేతల్లో పెట్టుకున్నారో అప్పటి నుంచి ప్రభుత్వం కూడా తనదైన శైలిలో ముందుకెళ్లిపోతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు ఠంచనుగా ఒకటో తేదీ జీతాలు, పెన్షన్లు జమ చేయడం గగనమైపోతోంది. అలాంటి సమయంలో సమస్యల పరిష్కారం అయినా జరిగిందా అంటే అదీ లేదు. సీపీఎస్ రద్దు చేయించడంలో విఫలమైన ఉద్యోగ నేతలు... జీపీఎస్ రూపంలో ప్రభుత్వం మరో స్కీమ్ తెస్తుంటే దాన్నీ అడ్డుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ ఉద్యోగ నేతలు తమ చెప్పుచేతల్లో ఉండటంతో ప్రభుత్వం కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది.

 జీపీఎఫ్ ఖాతాల్లో విత్ డ్రాపై ఆగ్రహం

జీపీఎఫ్ ఖాతాల్లో విత్ డ్రాపై ఆగ్రహం


ఇప్పటికే ఉద్యోగ సమస్యలు తీర్చడంలో జగన్ సర్కార్ తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగ నేతలు పోరాడకుండా వెన్నచూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి ఏకంగా రూ.800 కోట్లు మాయమైపోయాయి. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. వెంటనే ఉద్యోగ నేతలకు వరుసగా ఫోన్లు చేసి నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో ఉద్యోగ నేతలు మళ్లీ సచివాలయానికి క్యూ కట్టారు. యథావిధిగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సాంకేతిక తప్పిదం వల్లే ఇలా జరిగిందని మాత్రమే చెబుతోంది. ఈ డబ్బులు మళ్లీ ఎప్పుడు తిరిగొస్తాయో చెప్పలేకపోతోంది.

ఉద్యోగ నేతల మెడకు జగన్ నిర్ణయాలు ?

ఉద్యోగ నేతల మెడకు జగన్ నిర్ణయాలు ?

ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై అంతిమంగా కిందిస్దాయిలో ఉన్న ఉద్యోగులకు సమాధానం చెప్పుకోవాల్సింది ఉద్యోగ నేతలే. కానీ ఇప్పుడా పరిస్దితి లేదు. గతంతో పోలిస్తే ఉద్యోగ నేతలపై ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ తరుణంలో ఉద్యోగ నేతల్ని తమకోసం పోరాడతారా తప్పుకుంటారా అని ఉద్యోగులు నేరుగా ప్రశ్నించే పరిస్ధితి ఏర్పడుతోంది. దీంతో సచివాలయంలోనే కనిపించిన వారికల్లా ఉద్యోగ నేతలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల నుంచి తమకు ఎదురవుతున్న ఒత్తిడి గురించి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఠు ప్రభుత్వాన్ని ఒప్పించలేక, ఇటు ఉద్యోగులకు నచ్చజెప్పలేక నేతలు నలిగిపోతున్నారు.

English summary
ap employee association leaders fall under trouble with jagan govt's withdrawal of amounts from employees gpf accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X