అమరావతి రైతులకు మరిన్ని షాకులు ? ఈసారి బ్యాంకులు- ఫ్లాట్ల డాక్యుమెంట్లూ చిత్తు కాగితాలే !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్లాన్ ఇప్పుడు అక్కడి రైతులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. ఓవైపు అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధాని విశాఖకు, న్యాయరాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలిపోతుందన్న అంచనాల నేపథ్యంలో ఇక్కడి రైతుల్ని పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం పలు రూపాల్లో వారికి రోజుకో షాక్ ఇస్తుండగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులు సైతం అదే బాట పట్టాయి.

అమరావతి రిటర్నబుల్ ప్లాట్లు

అమరావతి రిటర్నబుల్ ప్లాట్లు


అమరావతి రాజధాని కోసం భూమిలిచ్చిన రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు కేటాయించేలా గతంలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 64735 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది. ఇందులో 38282 నివాస ప్లాట్లు, 26453 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఇందులో 40378 ప్లాట్ల కేటాయింపు పూర్తయింది. అయితే ఇందులో 2657 ప్లాట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగతాప్లాట్లు రిజిస్టర్ కావాల్సి ఉంది. అయితే ఇందులోనూ వీరికి చిక్కులు తప్పడం లేదు.

అమరావతి రైతుల కష్టాలు

అమరావతి రైతుల కష్టాలు

అమరావతిలో రాజధాని వస్తుందని, అక్కడ ప్రభుత్వం నిర్ణీత సమయంలో తమకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తుందని రైతులు భావించారు. కానీ ఈ రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు జరిగినా రిజిస్ట్రేషన్లు పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్ అయిన వారికి కూడా వాటిపై పూర్తి హక్కులు ఉన్నాయో లేవో తెలియడం లేదు. మరోవైపు రాజధాని రాకతో పొలాల్లో వ్యవసాయం కనుమరుగైంది. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు కూడా లేవు. ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదు. దీంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

 రుణాలివ్వని బ్యాంకులు

రుణాలివ్వని బ్యాంకులు

ఒకప్పుడు అమరావతిలో వంద గజాలు స్దలం ఉంటే చాలు రుణాలిస్తామంటూ వందల సంఖ్యలో ఫోన్లు చేసిన బ్యాంకులు.. ఇప్పుడు అమరావతి రాజధానిలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రైతులు రుణాల కోసం ప్రయత్నిస్తున్నా మొహం చాటేస్తున్నారు. అమరావతి రైతులకు రుణాలిస్తే అవి తిరిగి రావన్న ఆందోళనే అందుకు కారణం. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా రుణాలు పుట్టడం లేదు. దీంతో రైతులు తమ రిటర్నబుల్ ఫ్లాట్లను తాకట్టు పెట్టుకుని రుణాలిమ్మని కోరుతున్నా వాటినీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు.

 యథా సర్కార్ తథా బ్యాంకులు ?

యథా సర్కార్ తథా బ్యాంకులు ?

రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు అమరావతిని అభివృద్ది చేస్తున్న క్రమంలో ఇక్కడి రైతులకు రుణాలిచ్చేందుకు ఎగబడ్డ బ్యాంకులు సైతం ఇప్పుడు తమ స్ధలాల డాక్యుమెంట్లు తనఖా పెట్టుకుని రుణాలిమ్మంటే కూడా ఆసక్తి చూపడం లేదు. అమరావతిలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో కేవలం ఇళ్లపై మాత్రమే విద్యారుణాల వంటివి ఇస్తున్నారు. మిగతా రుణాల విషయంలో బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులు అమరావతి రాజధాని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిరాసక్తత కారణంగానే తమకు ఈ పరిస్దితి ఎదురవుతోందని ఆరోపిస్తున్నారు. తక్షణం ప్రభుత్వం రాజధానులపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప పరిస్దితిలో మార్పు వచ్చేలా కనిపించట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+