Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్మార్ట్ సిటీస్: తెలంగాణలో 2, ఏపీకి ఒకటి ఎక్కువ

హైదరాబాద్: దేశంలోని వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయటంతోపాటు 476 పట్టణాలను అటల్ పట్టణ నవీకరణ పథకం కింద పూర్తిస్థాయిలో పునః నిర్మించడానికి రూపొందించిన రెండు ప్రతిష్టాత్మక పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో పథకాలు అమలవుతాయి.

ఈ పథకాల్లో భాగంగా స్మార్ట్ సిటీస్ అభివృద్ధి చేయడానిక ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధిక సంఖ్యలో నగరాలకు అవకాశం లభించనుంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్రలున్నాయి. స్మార్ట్‌సిటీల కింద ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో రెండు నగరాలు ఎంపిక చేశారు.

వీటితో పాటు 476ల 'అమృత్‌' నగరాలుగా గుర్తించింది. ఈ పథకాల్లో భాగంగా ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనల్లో ఉన్న నగరాల వివరాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సీనియర్‌ అధికారి వివరించారు. లక్షకుమించి జనాభా ఉన్న పట్టణాలను ప్రతిఒక్క రంగంలో సమగ్రంగా అభివృద్ధి చేయటానికి రూపొందించిన అటల్ పట్టణ నవీకరణ పథకం కింద ఏపీలో 31, తెలంగాణలో 15 పట్టణాలు ఎంపికయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌ నుంచి 13 నగరాలను 'స్మార్ట్ సీటీస్'గా తీర్చిదిద్దనున్నారు. అలాగే, 'అమృత్‌' పథకం కింద అభివృద్ధి పరిచేందుకు 64 నగరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. తమిళనాడు నుంచి స్మార్ట్ సిటీస్ పథకం కింద 12, 'అమృత్‌' కింద 33 నగరాలను అభివృద్ధి పరుస్తారు.

మహారాష్ట్ర నుంచి స్మార్ట్ సిటీస్ పథకం కింద 10, 'అమృత్‌' కింద 37 నగరాలను గుర్తించారు. గుజరాత్‌, కర్ణాటకల్లో 6 నగరాల చొప్పున 'స్మార్ట్ సిటిస్' పథకం కింద, 'అమృత్‌' పరిథిలో 31, 21 నగరాలను గుర్తించారు. ఢీల్లీకి మాత్రం ఈ రెండు పథకాల కింద ఒక్కోనగరాన్ని మాత్రమే ప్రతిపాదించే అవకాశం లభించింది.

Most 'Smart Cities' to come up in Uttar Pradesh, followed by Tamil Nadu and Maharashtra

దేశంలోని 12 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లు ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టనున్న పట్టణాల అభివృద్ధి పథకాల్లో ప్రముఖపాత్ర పోషించనున్నాయి.

వివిధ రంగాల్లో ఆరితేరిన నిపుణల బృందం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని స్మార్ట్ సిటీలను ఎంపికచేసింది. 2015-16లో అభివృద్ధికి సంబంధించిన ప్రతి ఒక్క రంగంలో అగ్రగామిగా నిలిచే 20 నగరాలను మాత్రమే స్మార్ట్‌సిటీ పథకానికి ఎంపిక చేసి నిధులుకేటాయిస్తారు. మిగిలిన నగరాలకు రెండోదశలో నిధులు కేటాయింపు జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అమృత్ పట్టణాలు (31)
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, కడప, అనంతపురం, విజయనగరం, ఏలూరు, ప్రొద్దుటూరు, నంద్యాల, ఒంగోలు, ఆదోనీ, మదనపల్లి, చిత్తూరు, మచిలీపట్నం, తెనాలి, చీరాల, హిందూపురం, శ్రీకాకుళం, భీమవరం, ధర్మవరం, గుంతకల్లు, గుడివాడ, నర్సరావుపేట, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట ఉన్నాయి.

తెలంగాణలో అమృత్ పట్టణాలు (15)
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, ఆదిలాబాద్, కొత్తగొడెం, సిద్ధిపేట, సూర్యాపేట, మిర్యాలగూడ, జగిత్యాల ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+