గుంటూరులో విషాదం: పిల్లలతో సహా రైలులోంచి దూకి తల్లి ఆత్మహత్య
అమరావతి: ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, ఓ కూతురు మృతి చెందగా, కుమారుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు.
బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ విషాదాన్ని నింపింది. కదులుతున్న రైలు నుంచి తన కొడుకు, కూతురితో కలిసి ఓ మహిళ రైలు కిందకు దూకింది. దీంతో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.

తీవ్ర గాయాలు పాలైన కుమారుడిని స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే కుటుంబ కలహాల కారణంగానే మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications