అమ్మ బాధను చూడలేకపోయా: కంటతడి పెట్టిన నాగార్జున(పిక్చర్స్)
హైదరాబాద్: తన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె పడుతున్న బాధను చూసి తాను తట్టుకోలేకపోయానని టాలీవుడ్ హీరో నాగార్జున చెప్పారు. తనకు అప్పుడు పెయిన్ అండ్ పాలియేటీవ్ కేర్ గురించి తమకు తెలియదని, దీంతో ఆమెకు ఈ సర్వీసును అందించలేకపోయామని తెలిపారు. అయితే తన తండ్రికి ఆరోగ్యం క్షీణించిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఈ పద్ధతి అనుసరించడంతో, ఆయన తుదిశ్వాస విడిచేవరకు నొప్పి తెలియకుండా సంతోషంగా గడిపారని చెప్పారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ సదస్సును శుక్రవారం ఆయన హెచ్‌ఐసీసీలో ప్రారంభించారు. కేన్సర్, ఇతర వ్యాధులతో బాధపడేవారిని ఆఖరి దశలో ఆదుకునే పాలియేటివ్ కేర్ ఆవశ్యకత చాలా ఉందని చెప్పారు. అనారోగ్యంతో అమ్మ ఏడేళ్లు బాధపడిందని, చివరి ఆరునెలలూ ఆమె పడిన బాధ తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.
అప్పుడు పాలియేటివ్ కేర్ గురించి వైద్యులెవరూ చెప్పలేదని కంటతడి పెట్టారు. చికిత్సలతో ఆమె భరించలేని నొప్పులు అనుభవించిందని, ఒకానొక దశలో ఆమె 30 ఏళ్ల క్రితం నాన్నతో మద్రాసులో గడిపిన రోజులను తలచుకుని తనలో తానే మాట్లాడుకునేదని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.
కానీ నాన్నకు బాధ అంటూ ఏంటో తెలియకుండా చూసుకున్నామని, ఆయన ముఖంలో సంతోషం తగ్గకుండా పంపించామని నాగార్జున చెప్పారు. పాలియేటివ్ కేర్ గురించి తెలియడంతో ఆయనకు ఆ సేవలను అందించామని వెల్లడించారు.

నాగార్జున
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ సదస్సును శుక్రవారం సినీనటుడు హెచ్‌ఐసీసీలో ప్రారంభించారు.

నాగార్జున
తన తల్లి అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె పడుతున్న బాధను చూసి తాను తట్టుకోలేకపోయానని టాలీవుడ్ హీరో నాగార్జున చెప్పారు.

కంటతడి పెట్టిన నాగార్జున
తనకు అప్పుడు పెయిన్ అండ్ పాలియేటీవ్ కేర్ గురించి తమకు తెలియదని, దీంతో ఆమెకు ఈ సర్వీసును అందించలేకపోయామని తెలిపారు.

నాగార్జున
అయితే తన తండ్రికి ఆరోగ్యం క్షీణించిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఈ పద్ధతి అనుసరించడంతో, ఆయన తుదిశ్వాస విడిచేవరకు నొప్పి తెలియకుండా సంతోషంగా గడిపారని చెప్పారు.

నాగార్జున
కేన్సర్, ఇతర వ్యాధులతో బాధపడేవారిని ఆఖరి దశలో ఆదుకునే పాలియేటివ్ కేర్ ఆవశ్యకత చాలా ఉందని చెప్పారు. అనారోగ్యంతో అమ్మ ఏడేళ్లు బాధపడిందని, చివరి ఆరునెలలూ ఆమె పడిన బాధ తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications