తల్లి చేతిలో హత్యకు గురైన కొడుకు
విజయవాడ: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్న వయస్సలోనే మద్యపాన వ్యసనానికి లోనై వేధిస్తున్నాడని కన్నతల్లే కొడుకుని హతమార్చింది. కొడుకు వేధింపులు అంతకంతకు పెరిగిపోతుండటంతో తట్టుకోలేక ఆ తల్లి కొడుకుని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చింది.

యాకమూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల తుమ్మల తేజ మద్యానికి బానిసై తరచూ తల్లిని వేధించేవాడు. కొడుకు వేధింపులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇనుప రాడ్డుతో తలపై మోదడంతో తీవ్రగాయాలైన తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications