వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. దూకుడు చూపిస్తారా ?

|
Google Oneindia TeluguNews

టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి పాల్గొన్నారు.

మోత్కుపల్లి సోమవారం రాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు . గతంలో టీడీపీ నేతగా ఉన్న సమయంలో ఆయన టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు, తరువాత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు . 2008 అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి సీటును కోల్పోయారు.నవంబర్ లో బీజేపీ నేతలతో కీలక చర్చల్లో పాల్గొన్న మోత్కుపల్లి ఇన్ని రోజులు బీజేపీ లోకి చేరలేదు.

Mothkupalli Narsimhulu joined in BJP

ఇటీవల ఆయన బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో మోత్కుపల్లి భారతీయ జనతా పార్టీలో చేరారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో బీజేపీ కూడా కీలకంగా వ్యవహరించనుంది. ఒకప్పుడు టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో కాస్త వెనుకబడిన మోత్కుపల్లి జాతీయ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడైనా ఆయన దూకుడు చూపిస్తారా అన్నది ముందు ముందు తెలియనుంది.

English summary
Former Telangana TDP leader Motkupalli Narasimhulu is joined the BJP. Motkupalli left to Delhi along with BJP state president Dr. K Laxman on Monday night. Earlier, he demanded to merge TDP with TRS and later got suspended from the party. In the 2008 Assembly elections, Motkupalli contested from Aler constituency and lost the seat. Recently, he decided to join BJP. In this context, Motkupalli joined the saffron party in the presence of the BJP working president JP Nadda .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X