మోత్కుపల్లి టిడిపికి గుడ్‌బై చెబుతారా, కాంగ్రెస్ వైపు..?

రాజ్యసభ సభ్యత్వం మొదలు అన్ని విషయాల్లో మోత్కుపల్లి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన గుర్రుగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో మోత్కుపల్లి తనను రాజ్యసభకు నామినేట్ చేస్తారని ఆశించారు. కానీ అది కుదరలేదు. దీంతో అలకవహించిన ఆయన అప్పుడే పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది.
రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఓటు వేయరని అందరూ భావించారు. ఎర్రబెల్లి దయాకర రావు, ఇతర నేతల బుజ్జగింపులతో ఓటు వేసేందుకు వచ్చిన మోత్కుపల్లి... తాను అసంతృప్తితోనే ఓటేసినట్లు చెప్పారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు. ఇప్పుడు మాత్రం ఆయన పెదవి విప్పడం లేదు. కొద్ది రోజులుగా ఆయన మీడియా ముందుకు రావడం లేదు.
ఇందుకు పార్టీని వీడే ఉద్దేశ్యంతోనే అంటున్నారు. మోత్కుపల్లి ఒకటి రెండు రోజులలో కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది నల్గొండ జిల్లానే. ఇదే జిల్లా నుండి దళిత సామాజిక వర్గం ముఖ్య నేత ఉంటే మైలేజీ వస్తుందని ఆ పార్టీ కూడా భావిస్తోందట. అయితే, గ్రూపు రాజకీయాలతో అది ఏ మేరకు సాధ్యమో చూడాలి.












Click it and Unblock the Notifications