సీఎం జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించిన మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్!!

ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిక్ వుజిసిక్ కాళ్లు చేతులు లేకుండా జన్మించినప్పటికీ, చిన్నప్పటినుంచి తనకున్న శారీరక , సామాజిక అవరోధాలను పక్కనపెట్టి మొక్కవోని దీక్షతో విభిన్న సామర్ధ్యాలను అందిపుచ్చుకున్నారు.

ఈత కొట్టడం, సర్ఫింగ్ చేయడం, గోల్ఫ్ ఆడటం, నోట్లో పెన్ను పెట్టుకుని రాయడం, కాలివేలితో టైపింగ్ చేయడం వంటి సామర్థ్యాలతో పాటు, వక్తగా అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన అందిస్తున్న వివిధ పథకాల గురించి చాలా గొప్పగా చెప్పారు. సీఎం జగన్ తనతో పాటు ఎంతో మందికి ప్రేరణ ఇస్తున్నారని నిక్ వుజిసిక్ పేర్కొన్నారు.

Motivational speaker Nik Vujicic praised ys Jagan mohan reddy regime in ap!!

ముఖ్యమంత్రి జగన్ నాకు, దేశానికి, ఎంతో మంది యువతకు ఆదర్శమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యారంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని, ఆయన తన విజన్ తో బడులలో మౌలిక వసతులను కల్పించడంతోపాటు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేశారని నిక్ వుజిసిక్ సీఎం జగన్ చేసిన విద్యారంగ మార్పులను వెల్లడించారు. అమ్మ ఒడి లాంటి పథకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నాడు నేడు ద్వారా కృషి చేశారని ఆయన తెలిపారు. ఇక ఆపై అక్కడ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఆయన యువత తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

మీ మనసులోకి ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి.. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో ఉండండి.. విజయాలను ఆస్వాదించండి అంటూ ఆయన తనదైన శైలిలో యువతను మోటివేట్ చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బలంగా ఉండాలని, సాధించాలనే ఆశను ఎప్పుడు వదులుకోకూడదని, సహనంతో, మీ కలలను నిజం చేసుకోవాలని ఆయన యువతకు ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+