ఏపీ ప్రజల నెత్తిన పాలు పోసిన నరేంద్రమోడీ

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నరేంద్రమోడీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. మోటుమర్రి-విష్ణుపురం సింగిల్ రైల్వే లైనును డబుల్ లైనుగా విస్తరించబోతున్నారు. 88.81 కిలోమీటర్ల పొడవుండే ఈ లైను డబ్లింగ్ కు ప్రధానమంత్రి అధ్యక్షతను జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. అంచనా వ్యయం రూ.1746.20 కోట్లు. ఇది పూర్తయితే విజయవాడ-హైదరాబాద్ రైల్వే లైనుకు ప్రత్యామ్నాయ లైను అవడంతోపాటు దగ్గరి దారి అవబోతోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మోటుమర్రి వద్ద 10.87 కిలోమీటర్ల పొడవునా రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్టు వస్తుంది. ఒక రైలు కింద నుంచి వెళుతుంటే మరో రైలు దాని పై వంతెన నుంచి వెళుతుంది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధితోపాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటిది విజయవాడ దగ్గర ఒకటి ఉంది. ఇది రెండోది అవుతుంది. విజయవాడ-గూడూరు మధ్య మూడో రైల్వే లైను నిర్మాణం పూర్తికావొచ్చింది. దీన్ని కూడా నాలుగు లైన్లకు విస్తరించాలని నిర్ణయించారు. మరోవైపు విజయవాడ-విశాఖపట్నం మధ్య నాలుగు లైన్ల రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సర్వేను కూడా కేంద్రం ప్రకటించింది.

motumarri and vishnupuran railway single line will convert to doublle line

అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద 72 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించబోతున్నారు. అందుకు ఒక్కో స్టేషన్ కు రూ.25 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం నుంచి విజయవాడవైపు నాలుగు లైన్ల వల్ల రైల్వేకు నిర్వహణ వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. అలాగే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు, విశాఖపట్నం నుంచి విజయవాడవైపు ఒకేసారి రెండు రైళ్లు దూసుకెళ్లనున్నాయి. దీన్ని క్వాడ్రఫుల్ రైల్వే ట్రాక్ అని పిలుస్తారు. దీనివల్ల సెమీ హైస్పీడ్ రైళ్ల వేగం గంటకు సగటున 200 కిలోమీటర్లకు పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+