మస్తాన్ బాబు మృతదేహాం తరలింపు మరింత ఆలస్యం
హైదరాబాద్: ప్రపంచ ప్రసిధ్దిగాంచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు భౌతికకాయం తరలింపు మరో రెండు రోజులు ఆలస్యం కానుంది. నిజానికి మస్తాన్‌బాబు మృతదేహం ఆదివారం రాత్రి చెన్నై చేరుకోవాల్సి ఉంది. కానీ మస్తాన్ బాబు భౌతికకాయానికి విమానంలో చోటు దక్కలేదు.
అర్జెంజీనాలోని ఆండీస్ పర్వతారోహణకు వెళ్లిన మల్లి మస్తాన్ బాబు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మంచుకొండల్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు పది రోజుల తర్వాత మస్తాన్ బాబు మృతదేహాన్ని కనుగొన్న అర్జెంజీనా అధికారులు, ఆయన భౌతికకాయాన్ని భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

శనివారం రాత్రే మస్తాన్ బాబు భౌతిక కాయం అర్జెంటీనా నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో విమానంలో మస్తాన్ బాబు భౌతిక కాయానికి చోటు లభించలేదు. దీంతో ఆదివారం రాత్రికి మస్తాన్ బాబు భౌతిక కాయం అర్జెంటీనా నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
చెన్నైకి చేరుకున్న తర్వాత మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని నెల్లూరు జిల్లాలోని స్వగ్రామం గాంధీ గిరిజన సంఘానికి తరలిస్తారు. అక్కడే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. మస్తాన్ బాబు మృత దేహం కోసం కుటుంబ సభ్యులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications