వైసీపీ ఎంపీ బాబూరావు పార్టీ మార్పు - భవిష్యత్ పై క్లారిటీ..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నేతలు అధికార కూటమి వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కూటమి నేతలతో టచ్ లోకి వెళ్లారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇద్దరు పార్టీకి.. ఎంపీ పదవులకు రాజీనామా చేసారు. టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో మరో ఎంపీ గొల్లా బాబూరావు పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగతోంది. దీని పైన బాబూరావు క్లారిటీ ఇచ్చారు. తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు.
పార్టీ మార్పు పై
పార్టీ మారుతున్నట్టు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మండిపడ్డారు. దళితుడిని కాబట్టే తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. తనపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంపై చాలా బాధేస్తోందిని చెప్పుకొచ్చారు.

బాబూరావు క్లారిటీ
వైఎస్ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. నాడు వైయస్ఆర్ నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే.. వైయస్ జగన్ నన్ను రాజ్యసభకు పంపించారని చెప్పారు. వైయస్ జగన్ పట్ల తాను ఎంతో నిబద్ధతతో ఉంటానని వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీ మరణించిన సమయంలో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేసారు. నీతి, నిజాయితీగా బతికిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించారు.
వైసీపీలోనే ఉంటాను
ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తానని బాబూరావు ప్రకటించారు. ఇప్పటికే ఇదే రకమైన ప్రచారం పై ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆర్ క్రిష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. తాము పార్టీ మారటం లేదని స్పష్టం చేసారు. మరో వైపు ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసారు. పోతుల సునీత ను టీడీపీలోకి తీసుకోకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో, రానన్న రోజుల్లో చోటు చేసుకొనే రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications