టీడీపీ అనుకూలంగా ప్రశాంత్ కిశోర్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడానికి కారణం?

Perni Nani: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.

ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

MP Gorantla Madhav made key remarks on Prashant Kishor

ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతోన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదని అన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని, 9వ తేదీన వైఎస్ జగన్.. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, వరుణదేవుడు తమ పార్టీలోనే కొనసాగుతున్నాడని గోరంట్ల మాధవ్ చెప్పారు. వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతోండటం వల్లే వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందంటూ రాజకీయ వ్యూహకర్త ప్ర‌శాంత్ కిషోర్‌ చేస్తోన్న ప్రచారంలో అర్థం లేదని కొట్టిపారేశారు.

ఎన్నికల సమయంలో ఓ పార్టీలో చేరాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చెల్లలేదని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పే మాటలు శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టుగా మారింద‌ని చురకలు అంటించారు. ప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారని, వాటిని ప్రోత్సహించడానికే ఆయనతో సానుకూలంగా స్టేట్‌మెంట్లు ఇప్పిస్తోన్నారని అన్నారు.

2019లో వచ్చిన ఫలితాలే ఈ సారి కూడా పునరావృతం అవుతాయ‌ని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి తేదీ, సమయాన్ని వైఎస్ జగన్ ఫిక్స్ చేశార‌ని, చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో 151కి పైగా, లోక్‌సభలో 22కు పైగా సీట్లను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+