పవన్ కల్యాణ్.. ఓ బచ్చా, జనసేనకూ ప్రజారాజ్యం గతే పడుతుంది: ఎంపీ జేసీ
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ కు సినిమాలంటే తెలుసు కానీ, ప్రజా సమస్యల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు దర్మపోరాట దీక్షకు సంఘీభావంగా ఉరవకొండలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తలపెట్టిన దీక్షలో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.సినిమాల్లో మాదిరి ఇక్కడ నటించడం అంత సులువు కాదని పవన్ కల్యాణ్ ను విమర్శించారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేన పార్టీకి పడుతుందని జేసీ అన్నారు. ఆనాడు కులాన్ని అడ్డుపెట్టుకుని చిరంజీవి పార్టీ స్థాపించారని, దాని సంగతి ఏమైందో అందరికీ తెలిసిందేనని అన్నారు.












Click it and Unblock the Notifications