అమిత్ షా.. దేశానికి మంచిదికాదు: కేశినేని సంచలనం, సోనియాను చూపి శివప్రసాద్ హెచ్చరిక
Recommended Video

న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై టీడీపీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును, పార్టీ నేతలను ఆయన విమర్శించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. స్వయంగా చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
చనిపోయిన తన తల్లిదండ్రులను అనడం సరికాదని, ఇదేనా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం, భారతీయ సంప్రదాయం అన్నారు. మంత్రి జలీల్ ఖాన్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఓ బ్రోకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన బ్రోకర్ పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ తీరు ఇక్కడ పోరాటం, అక్కడ ఆరాటం అన్నట్లుగా ఉందని చెప్పారు.

దేశానికి మంచిది కాదు.. అమిత్ షాపై కేశినేని నాని
పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి, జైలుకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దేశ రాజకీయాలు నడపడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీజేపీ నాటకం ఆడిస్తోందన్నారు. మీన్ మెంటాలిటీ ఉన్నవాల్లు ఉన్నతస్థాయి పదవుల్లో ఉండటం దేశానికి మంచిది కాదన్నారు.

బుద్ధి ఉన్నవారు తల్లిదండ్రుల్ని నిందిస్తారా?
ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆర్థిక నేరస్తుడైన విజయసాయి రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేరుగా అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బుద్ధి ఉన్నవారు ఎవరైనా తల్లిదండ్రుల్ని నిందిస్తారా అని ప్రశ్నించారు. విజయసాయి విమర్శల వెనుక బీజీపీ ఉందన్నారు.

మరోసారి ఇలాగే మాట్లాడితే.. హెచ్చరిక
చంద్రబాబు ప్రజానేత అని బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయి ధనబలం ఉన్న నీచ రాజకీయ నాయకుడన్నారు. ఆయన చేసిన నీచమైన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకిస్తోందన్నారు. ప్రధాని కాళ్లపై పడ్డ విజయసాయికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని పార్టీలు రాకపోవడం దారుణం అన్నారు.
నారదుడి వేషధారణలో శివప్రసాద్ నిరసన
ఇదిలా ఉండగా, ఏపీకి న్యాయం చేయాలంటూ ప్రతి రోజు వివిధ వేషధారణల్లో వస్తూ నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బుధవారం నారదుడి వేషంలో నిరసన తెలిపారు. వింటేనే ఉంటారు మోడీ అంటూ పద్యం పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్‌తో పెట్టుకొని కాంగ్రెస్ దెబ్బతిన్నదని, విభజన చేయవద్దని సోనియాకు చెప్పినా వినలేదని, దీంతో ఆ పార్టీ దెబ్బతిన్నదని, ఇప్పుడు మోడీ కూడా వింటేనే బాగుంటారన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications