రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుష్కరాలు: కేశినేని నాని ఉచిత బస్, జగన్ ఆగ్రహం, తోపులాట విషాదం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. పుష్కర ఘాట్ల వద్ద భక్తులు బారులు తీరుతున్నారు. పలు ప్రాంతాల్లో నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రేపటి నుంచి గోదావరి పుష్కరాలకు కేశినేని ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు విజయవాడ ఎంపి కేశినేని నాని చెప్పారు.

రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఈ బస్సులు ప్రారంభిస్తామన్నారు. ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. సేవలో కేశినేని ట్రావెల్స్ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ.. తొక్కిసలాట పైన చంద్రబాబు మీద దుష్ప్రచారం చేయటం తగదన్నారు. గతంలో కంటే గోదావరి పుష్కరాల్లో వసతులు బాగున్నాయన్నారు. ఏ ఘాట్లో స్నానం ఆచరించినా ఒక్కటేనని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మంగళవారం మృతి చెందిన ఓ మహిళ మృతదేహంపై పడి విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మంగళవారం మృతి చెందిన ఓ మహిళ మృతదేహంపై పడి విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.

తోపులాట

తోపులాట

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం తోపులాట జరిగి, 27 మంది భక్తులు మృతి చెందారు. తోపులాట దృశ్యం.

పుష్కరాలు

పుష్కరాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో... ఓ భవనం పై నుంచి పరిస్థితిని పరిశీలిస్తున్న పోలీసులు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మంగళవారం మృతి చెందిన ఓ మహిళ మృతదేహంపై పడి విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో... భారీగా తరలి వచ్చిన భక్తులు. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు.

పుష్కరాలు

పుష్కరాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో... భారీగా తరలి వచ్చిన భక్తులు. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

రాజమండ్రి పుష్కరాల్లో దారుణం జరిగింది. మంగళవారం ఉదయం ప్రధాన పుష్కర ఘాట్ అయిన కోటగుమ్మం ఘాట్ మొదటి గేట్ వద్ద పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగడంతో 27మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. సొమ్మసిల్లిన మహిళకు నీరు తాగిస్తున్న దృశ్యం.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పన్నెండేండ్లకు ఒకసారి జరిగేది కావడమూ, అందునా ఈ సారి 144 ఏండ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరం కావడంతో మొదటి రోజే ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రాజమండ్రిలోని కోటగుమ్మం ఘాట్ వద్దకు పుణ్య స్నానాలకోసం వచ్చారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.

ఎన్టీఆర్ విగ్రహం

ఎన్టీఆర్ విగ్రహం

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో... గోదావరి నది ఒడ్డిన ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ వేషధారణలోని ఎన్టీఆర్ విగ్రహం.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో... భారీగా తరలి వచ్చిన భక్తులు. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. చిన్నారని ఎత్తుకొని...

రాజమండ్రి

రాజమండ్రి

రాజమండ్రిలో మంగళవారం ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. 27 మంది భక్తులు మృతి చెందారు.

పోటెత్తిన భక్తులు

పోటెత్తిన భక్తులు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో... భారీగా తరలి వచ్చిన భక్తులు. లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు.

English summary
MP Kesineni says they will run free buses for Pushkaralu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X