మీకు మీరే దాడి చేసుకుని మాపై బురద చల్లుతారా? పట్టాభి మురికికాల్వలో తిరిగే పంది: ఎంపీ మార్గాని భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడి చేసిన తర్వాత చంద్రబాబు బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వైసిపి నేతల తీరుకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునివ్వడంతో అటు టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగిస్తున్నారు. టిడిపి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు.

చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్ధం చేస్తామన్న మార్గాని భరత్
ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీ నాయకులు కూడా టిడిపి నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు. మాటకు మాట వినిపిస్తున్నారు. బంద్ చేస్తే టీడీపీ తీరుకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి రెడీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తీరుకు నిరసనగా వైయస్సార్ సిపి పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్ ఈరోజు చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేయాల్సిందిగా వైఎస్ఆర్సిపి నాయకులకు పిలుపునిచ్చారు.

టీడీపీ నాయకులు మాట్లాడే తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది
వేమగిరి జంక్షన్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. టిడిపి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టు, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టినట్టు మార్గాని భరత్ పేర్కొన్నారు . ఇదే సమయంలో టిడిపి నాయకుల తీరుపై ఎంపీ మార్గాని భరత్ స్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి నాయకులు మాట్లాడే తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని ఎంపీ మార్గాన్ని భరత్ పేర్కొన్నారు.

పట్టాభి మురికి కాలవలో తిరిగే పంది అనగలం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బూతులు తిడుతూ దూషిస్తున్నారని మండిపడ్డారు. ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని టిడిపి నాయకులు చూస్తున్నారని మార్గాని భరత్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పట్టాభి కి లేదని మార్గాని భరత్ మండిపడ్డారు. పట్టాభి మురికి కాలవలో తిరిగే పంది అని తాము కూడా మాట్లాడగలమని పేర్కొన్నారు మార్గాని భరత్.గతంలో టిడిపి నాయకులు హిందూ దేవాలయాలపై దాడులు చేయించి, వైసిపి పైన రుద్దే ప్రయత్నం చేశారని అప్పుడు కూడా రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేశారని మార్గాని భరత్ మండిపడ్డారు.
Recommended Video

మీకు మీరే దాడి చేసుకుని మా మీద బురద జల్లే ప్రయత్నం
పట్టాభి ఎవరో కూడా అసలు జనాలకు తెలియదని పేర్కొన్న వైసీపీ ఎంపీ మీకు మీరే దాడి చేసుకుని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మార్గాని భరత్ మండిపడ్డారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామ పైన చంద్రబాబు చెప్పులు విసిరించిన ఘటన రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదని, టీడీపీ నేతల తీరు అలాంటిదని మార్గాని భరత్ మండిపడ్డారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజమనే సామెత చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుందని మార్గాని భరత్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ఉనికిని కోల్పోయి, రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించిన వైసిపి పైన నెట్టి లబ్ధి పొందాలని చూస్తోందని రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications