వచ్చే ఎన్నికల్లో పోటీపై మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పుంగనూరులో పార్టీ శ్రేణులతో ఎంపీ సమావేశమయ్యారు. జమిలి ఎన్నికల పైన మరోసారి చర్చ మొదలైన వేళ ఎన్నికల గురించి మిథున్ ప్రస్తావించారు. ప్రస్తుతం జనగణన జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఆ తరువాతనే నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం అవుతుందని చెబుతూనే..వచ్చే ఎన్నికల్లో తన పోటీ పైన ఆసక్తికర కామెంట్స్ చేసారు.
కీలక సమావేశం
పుంగనూరులో పార్టీ కార్యకర్తలతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. జమిలి ఎన్నికల గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. నియోజవర్గాల పునర్విభజన జరగాలంటే ముందుగా జనగణన జరాల్సి ఉంటుందన్నారు. జనగణన లేకుండా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదన్నారు. 2011 తరువాత కేంద్ర జనగణన చేయలేదన్నారు. గణన పూర్తి చేస్తే డీ లిమిటేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేసారు. పుంగనూరు నియోజకర్గం డీ లిమిటేషన్ లో రెండుగా అవుతే తాను పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మిథున్ రెడ్డి వెల్లడించారు.

ఎమ్మెల్యేగా పోటీ
పుంగనూరు ప్రాంత అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో నాంది పలికిన టయోటా కంపెనీ, వాటర్ గ్రిడ్ పనులను కావాలంటే క్రెడిట్ మీరే తీసుకుని అయినా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మిథున్ కోరారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎంతో వెనుకబడిన పుంగనూరు ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా తాము ఎంతో చేసామన్నారు. అందులో భాగంగా ప్రఖ్యాత టయోటా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను తెచ్చామని గుర్తు చేసారు.
ప్రభుత్వానికి వినతి
అన్ని మౌలిక వసతి సౌకర్యాలు కల్పించడంతో శంకుస్థాపన కూడా చేశారన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వాటాలతో ప్రతి గ్రామానికి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ పథకం అమలుకు సిద్ధం చేసామని గుర్తుచేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించి, లక్షలాది మందికి దాహర్తి తీర్చే ఆ రెండు పనులను కొనసాగించాలని మిథున్ కోరారు. రాజకీయాలకు అతీతంగా పూర్తి చేయించడానికి ముఖ్యమంత్రిని ఒప్పించాలని కూటమి పార్టీల నాయకులను మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications