హైకోర్టులో రఘురామ పిటీషన్ - రక్షణ కల్పించండి : ప్రధాని పర్యటన వేళ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు హైకోర్టు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని మోదీ రాఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం పార్లమెంటరీ నియోజవర్గ పరిధిలోని భీమవరం రానున్నారు. అక్కడ అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతోత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కేంద్ర టూరిజం శాఖ పలువురు ప్రముఖుల తో పాటుగా రాజకీయ - ఇతర రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తూ లేఖలు పంపింది.

ప్రధాని పర్యటనకు ఆహ్వానాలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. టీడీపీ తరపున ప్రతినిధిని పంపాలని కోరారు. టీడీపీ నుంచి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. సీఎం జగన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు - పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమం కావటంతో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ సైతం హాజరు కావాల్సి ఉంది. అయితే, ఏపీ ప్రభుత్వం వర్సెస్ రఘురామ అన్నట్లుగా కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అసలు రఘురామ ప్రధాని కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనే చర్చ కొనసాగుతోంది.

కోర్టులో రఘురామ పిటీషన్
తాను హాజరవుతానని..తనను టచ్ చేయాలని చూడద్దంటూ రఘురామ స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ప్రధాని పర్యటనకు హాజరు అయ్యేందుకు వీలుగా తనకు రక్షణ కల్పించాలని ఆ పిటీషన్ లో కోరారు. దీనిని విచారించేందుకు హైకోర్టుల అనుమతించింది. స్థానిక ఎంపీగా పర్యటనకు వెళ్లచ్చు కదా అంటూ రఘురామ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, ఏదో ఒక కేసులో తన క్లయింట్ ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారంటూ ఆయన కోర్టుకు సమాధానం ఇచ్చారు.
Recommended Video


కోర్టు తీర్పు తరువాతే నిర్ణయం
తన క్లయింట్ పైన ఎలాంటి కేసులు లేకుండా.. రక్షణ కల్పించాలని, భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని పిటీషన్ లో కోరారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రదాని మోదీ హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. 4వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లనున్నారు. ఇప్పుడు కోర్టు తీసుకొనే నిర్ణయం ఆధారంగా రఘురామ రాజు హాజరు పైన స్పష్టతవ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications