• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర ఆర్థిక,రక్షణ శాఖలు వైసీపీకి దక్కుతాయని మావాళ్ల టాక్-ఏపీలో స్మగ్లింగ్‌పై ఢిల్లీ నజర్:రఘురామ

|

మోదీ సర్కారు రూపొందించిన పలు విధానాలను వ్యతిరేకిస్తూ.. ఎన్డీఏ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నా.. ఎన్డీఏలోని వైసీపీ మాత్రం కేంద్రం నిర్ణయాలకు బేషరతుగా మద్దతు పలుకుతుండటం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేపట్టబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో వైసీపీకి బెర్తులు దక్కుతాయని ఢిల్లీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇదే అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆలయాల్లో చోరీలు, ఎర్రచందనం స్మగ్లింగ్, విద్యాపథకంలపైనా స్పందించారు. ఎంపీ ఎం చెప్పారంటే...

జస్టిస్ ఎన్వీ రమణపై 9ఏళ్లుగా ఇలానే - జగన్ కుట్రలకు ఆధారాలివే - ఎంపీ రఘురామ తాజా బాంబు

జనం వెర్రిపుష్పాలు కాదు

జనం వెర్రిపుష్పాలు కాదు

‘‘భారీ వర్షాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి మహానగరాలే వరదకు మునిగిపోతే, అమరావతిలో మాత్రం ఎలాంటి విపరీత పరిస్థితి ఉత్పన్నం కాలేదు. కానీ వైసీపీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతల్లో మాత్రం అమరావతిలోని ప్రభుత్వ భవనాలు నీట మునిగినట్లు గ్రాఫిక్స్ ఫొటోలను సర్క్యులేట్ చేస్తున్నారు. అవ భూముల కుంభకోణంలో పీకల్లోతులో కూరుకుపోయిన వైసీపీ ప్రముఖులు కూడా ఈ ఫొటోలను షేర్ చేశారు. వీటిని నమ్మడానికి ప్రజలు వెర్రిపుష్పాలు కాదు.

 స్మగ్లింగ్‌పై కేంద్ర మంత్రి విస్మయం

స్మగ్లింగ్‌పై కేంద్ర మంత్రి విస్మయం

విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాలను కొట్టేసినవాళ్లపై చర్యలు లేవు. అదే సింహాచలం అప్పన్న ఇత్తడి విగ్రహాల దొంగల్ని వేగంగా పట్టుకుని, ఆ ఈవోను సైతం సస్పెండ్ చేశారు. ఇత్తడి కంటే వెండికి విలువ ఎక్కువ అయినా కూడా దుర్గగుడి ఘటనలో ఈవోపై చర్యలు లేకపోవడం గమనార్హం. మరోవైపు.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా సాగుతోంది. గత ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేసి కొందరు దొంగల పని పట్టింది. కానీ ఇప్పుడు స్మగ్లర్లకు అడ్డులేకుండా పోయిందని, దొంగలు బరితెగిస్తున్నారని సాక్ష్యాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్మగ్లర్లపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఎలాగూ ఏపీ ఖజానా ఇబ్బందుల్లో ఉంది కాట్టి శేషాచలం సంపద విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఆదాయమైనా వస్తుంది

 ఓవర్సీస్ విద్యానిధికి మంగం?

ఓవర్సీస్ విద్యానిధికి మంగం?

ఇవాళ పొద్దునే సురేశ్ అనే ఎస్టీ విద్యార్థి ఒకరు నాకు ఫోన్ చేశారు. అతను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి లబ్దిదారుడు. ఆ పథకం సొమ్మును గతంలో చంద్రబాబు రూ.15 లక్షలకు పెంచగా, 2019లో వైసీపీ సర్కారు వచ్చాక రూ.10లక్షలకు తగ్గించడమే కాదు, మొత్తంగా ఇప్పుడు పైసా ఇవ్వడంలేదు. బయటి దేశాల్లో చదువుకుంటోన్న ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు కడితేనే అవకాశం కొనసాగిస్తామని ఆయా కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రభుత్వనికి ఇష్టం లేకుంటే విద్యానిధి పథకానికి మంగళం పాడండి. కానీ విద్యార్థుల్ని విదేశాలకు పంపిన తర్వాత ఇలా డబ్బులు ఇవ్వకుండా వ్యవహరించడం సరికాదు.

 కేంద్రంలోకి వైసీపీ?

కేంద్రంలోకి వైసీపీ?

బహుశా మా పార్టీ నేతలు అనుకున్నది సరిగా నెరవేరలేదు కాబట్టే, సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి రావాలనుకుంటున్నారని నా అంచనా. కానీ మా పార్టీ వాళ్లు మాత్రం ‘మేము ఏది చేసినా మోదీ, అమిత్ షా గారికి చెప్పే చేస్తాం' అని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇవాళ్టికీ వర్తిస్తుందా లేదా అనేది తెలియాలి. వైసీపీకి కేంద్రంలో బాగా పరపతి ఉందని, ఏ పదవి కోరినా ఇచ్చేస్తారని, అవసరమైతే రక్షణ, ఆర్థిక శాఖలు కూడా వైసీపీకి ఇస్తారని మా పార్టీవాళ్లు మాట్లాడుకుంటున్నారు. అది నిజం కాదని నేను నమ్ముతున్నాను. నాపై చాలా ఉత్సాహంగా కుట్రలు చేసినవాళ్ల గురించిన నిజాలు అన్నీ బయటపెడతాను'' అని ఎంపీ రఘురామ తెలిపారు.

హైదరాబాద్‌కు రఘురామ

హైదరాబాద్‌కు రఘురామ

వైసీపీ శ్రేణుల నుంచి ప్రాణహాని ఉందంటూ కేంద్రం నుంచి భద్రత పొందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలా కాలంగా ఢిల్లీకే పరిమితైపోవడం, నిత్యం ‘రాజధాని రచ్చబడ్డ' పేరుతో ప్రెస్ మీట్లు నిర్వహిస్తుండటం తెలిసిందే. కాగా, చాన్నాళ్లకు ఆయన ఢిల్లీని వీడి హైదరాబాద్ రానున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో తాను హైదరాబాద్ లో ఉంటానని, వీలేతే వచ్చేవారం ప్రెస్ మీట్ కూడా హైదరాబాద్ లోనే నిర్వహిస్తానని ఎంపీ తెలిపారు. రఘురామపై అనర్హత వేటు ఫిర్యాదు ఇకా లోక్ సభ స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది.

5000 కేజీల బాంబు పేలితే ఎట్టా ఉంటదో తెలుసా? నిర్వీర్యం చేయబోతే చివరికిలా: వైరల్ వీడియో

English summary
narasapuram ysrcp rebel mp raghurama krishnam says his party believing that they could get even union finance and defence ministries too. speaking to media in delhi on thursday, the rebel slams cm jagan and ysrcp leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X