వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల కోసం ర‌ఘురామ‌కృష్ణరాజు పోరుబాట.. రివ‌ర్స్ పీఆర్సీకి నిర‌స‌న‌గా ఢిల్లీలో దీక్ష

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమ పట్ల దుర్మార్గం వ్యవహరిస్తోందిని మండిపడుతున్నారు. ఏపీ చరిత్రలో ఇలాంటి దుర్మార్గపు పీర్సీని చూడలేని దుయ్యబడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కూడా రద్దు చేయడమేంటని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ మరోమారు ఆందోళనకు ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు పలికారు.

 రఘురామకృష్ణరాజు దీక్ష

రఘురామకృష్ణరాజు దీక్ష


ఏపీ ఉద్యోగుల కోసం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృషరాజు పోరుబాటకు సిద్ధమైయ్యారు. సీఎం జగన్ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ కానుకగా ఇచ్చారని చురకలంటించారు. ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదన్నారు. ఉద్యోగులకు ఆశ చూపించి వారి జీతాల్లోనే కోత పడేలా పీఆర్సీ ఇచ్చారని ఆరోపించారు. జగన్ సర్కార్ తీరుపై ఉద్యోగులలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రివర్స్ పీఆర్సీకి నిరసనగా బుధవారం ఢిల్లీలో దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవ వరకు తన నివాసంలో దీక్ష చేపడుతున్నట్లు రఘరామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు అండగా నిలవాలని కోరారు.

 పీఆర్సీపై రగిలిపోతున్న ఉద్యోగులు

పీఆర్సీపై రగిలిపోతున్న ఉద్యోగులు

జగన్ సర్కార్ ప్రకటించి 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జీవో తెచ్చిన సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చీకటి దినంగా అభివర్ణిస్తున్నారు. తమతో చర్చించించకుండా జీవో ఇవ్వడం సరికాదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను రద్దు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా రద్దు చేయలేదని పేర్కొన్నారు. పీఆర్సీ అమలుకు కేంద్రం విధానాలకు ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోలను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యోగుల హక్కులను కాలరాసేలా జగన్ సర్కార్ తెచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీతో ప్రతి క్యాడర్లో ఉద్యోగులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు సీఎం జగన్ ఫిట్మెంట్ ఒక్కటే ప్రకటించి.. మిగతా అంశాలపై సీఎస్ తో మాట్లాడతామని చెప్పారు.. కానీ తర్వాత తమతో ఎవరూ తమతో చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో విరమించుకోకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

English summary
YCP MP Raghuramkrishnam Raju fight for ap govt employees voer revers prc
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X