'బాబు అలిగితే బీజేపీకి చుక్కలే', వెంకయ్య ఇల్లు ఊడుస్తా: రఘువీరా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలగటమే తెలియని నేత అని, ఆయన అలిగిన రోజు బీజేపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని టిడిపి ఎంపీ ఎంపీ శివప్రసాద్ సోమవారం నాడు వ్యాఖ్యానించారు.

బీజేపీ మిత్రపక్షంగా ఉండి కూడా ప్రత్యేక హోదా కోసం మళ్లీ పోరాటానికి దిగాల్సి రావడం దౌర్భాగమన్నారు. తమ నేత చంద్రబాబు ఇంకా తలొగ్గి మాట్లాడుతున్నారంటే అందుకు ఆయన ధర్మరాజులాంటి వారు కాబట్టి అన్నారు. ఆయనకు అంత తొందరగా కోపంగానీ, ఆవేశంగానీ రాదన్నారు. అలుగుటయే ఎరుగని ఆ అజాత శత్రువు చంద్రబాబు అలిగిన రోజు ఎటువంటి పరిస్థితులు వస్తాయో బీజేపీ అర్థం చేసుకోవాలన్నారు.

Also Read: దండయాత్ర కాదు: బొత్స, ఎన్డీయే నుంచి బయటకే: మోడీకి టిడిపి షాక్

రఘువీరా ఆగ్రహం

ఏపీకి ప్ర‌త్యేక హోదాపై ఈ నెల 5న రాజ్య‌స‌భ‌లో ఓటింగ్ జ‌రిగేలా రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బాధ్య‌త తీసుకోవాల‌ని ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరా రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో ఈ రోజు విద్రోహ స‌ద‌స్సు నిర్వహించారు.

MP Sivaprasad interesting comments on Chandrababu

ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరా మాట్లాడారు. ప్ర‌త్యేక‌ హోదా సాధిస్తే కేంద్ర మంత్రులు వెంక‌య్య నాయుడు, సుజ‌నా చౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఇళ్ల ముందు తాము చెత్త‌ను ఊడ్చ‌డానికి సిద్ధమ‌న్నారు. హోదాపై ఓటింగ్ జ‌ర‌గ‌క‌పోతే టిడిపి, బిజెపి నేత‌లను ప్ర‌జ‌లు తరిమికొడ‌తారన్నారు.

ప్ర‌జ‌ల కోసం చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లి హోదా కోసం పోరాడాల‌ని హితవు పలికారు. టిడిపి నేత‌లు హోదాపై ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని, వారిని వెర్రివాళ్ల‌ని చేయాల‌నుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లరని, ఎంపీలు మాత్ర‌మే అక్క‌డికి వెళ్లి అడుగుతారని చెప్పడం విడ్డూరమన్నారు. ఇక ఆయన ఎందుకన్నారు.

సీఎం చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్ల‌డం లేదన్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఆయ‌నకు ప‌ట్ట‌వా? అని నిలదీశారు. రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తే టిడిపి ఎంపీలు హోదాపై ఏమీ అడగలేదన్నారు. హోదాపై చంద్ర‌బాబు పోరాడాల‌ని కానీ, కాంగ్రెస్ పార్టీని టిడిపి నేత‌లు నిందించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Sivaprasad interesting comments on Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి