లకౌట్ నోటీసులు: అమెరికాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టుకు సుజనా చౌదరి

హైదరాబాద్: లుకౌట్ నోటీసుల నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సీబీఐ సుజనా చౌదరిపై 2019లో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే, లుక్ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ 2019లో సుజనా చౌదరి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

సుజనా చౌదరి డైరెక్టర్‌గా ఉన్నబెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ బ్యాంకులను మోసం చేసిందన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో నోటీసులపై హైకోర్టులో విచారణ ముగించింది.

 MP sujana chowdary petition filed in ts high court

గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుజనా చౌదరిని విచారణ జరిపామని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

విచారణ పేరుతో మళ్లీ మళ్లీ పిలిచే అవకాశం ఉందని సుజనా చౌదరి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఒక వేళ విచారణకు పిలిస్తే ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ నోటీసులు ఇస్తే, దానిపై అభ్యంతరాలుంటే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుజనా చౌదరికి సూచిస్తూ విచారణ ముగించింది.

కాగా, అమెరికాలో ఓ సదస్సుకు హాజరు కావాల్సి ఉందని, అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుజనా చౌదరి హైకోర్టును అభ్యర్థించారు. అత్యవసరంగా విచారణ జరపాలని సుజనా తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అమెరికా నుంచి అందిన ఆహ్వానం వివరాలను సమర్పించకుండా అత్యవసరంగా విచారణ చేపట్టలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత విచారణను జులై 7 వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+