కాంగ్రెస్‌కు షాక్: జగన్ పార్టీలోకి అనంత, వ్యూహాత్మకంగా

హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అనంతపురం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం సాయంత్రం ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాలో అనంత బలమైన నాయకుడు. ఆయన చేరికతో అనంతపురం జిల్లాతో పాటు పార్టీలో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

మాజీ జడ్పీ చైర్మన్ టిసి రెడ్డివారి నాగరాజు, మాజీ ఎఎంసి చైర్మన్ ఎస్ సత్యనారాయణ రెడ్డి, తాడిపత్రి నేత రంగారెడ్డి చేరారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. జగన్ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖాయమన్నారు.

అనంతపురం జిల్లాలో పార్టీ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అనంత వెంకట్రామి రెడ్డి చేరికతో అనంతపురం జిల్లాలో తమ పార్టీ మరింత పటిష్టమవుతుందని వైయస్ జగన్ అన్నారు.

శనివారం చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కలసి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పార్టీ మారుతున్న విషయాన్ని అనుయాయులకు కూడా చెప్పలేదట. జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన హఠాత్తుగా పార్టీని వీడడంతో జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బతగిలినట్లయింది.

వెంకట్రామి రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పని చేశారు. నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా పని చేశారు. ఆయన తండ్రి అనంత వెంకట్ రెడ్డి కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేసి పలు పదవులను చేపట్టారు. జిల్లా కాంగ్రెస్‌లో బలమైన నాయకుడిగా ఉన్న జెసి దివాకరరెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకోనుండడంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం వ్యూహాత్మకంగా ఆయనను జగన్ పార్టీలో చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది.

చేరిక

చేరిక

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అనంతపురం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం సాయంత్రం ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాలో అనంత బలమైన నాయకుడు.

అనంత

అనంత

ఆయన చేరికతో అనంతపురం జిల్లాతో పాటు పార్టీలో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

జగన్ ఆహ్వానం

జగన్ ఆహ్వానం

మాజీ జడ్పీ చైర్మన్ టిసి రెడ్డివారి నాగరాజు, మాజీ ఎఎంసి చైర్మన్ ఎస్ సత్యనారాయణ రెడ్డి, తాడిపత్రి నేత రంగారెడ్డి చేరారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. జగన్ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం ఖాయమన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

అనంతపురం జిల్లాలో పార్టీ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అనంత వెంకట్రామి రెడ్డి చేరికతో అనంతపురం జిల్లాలో తమ పార్టీ మరింత పటిష్టమవుతుందని వైయస్ జగన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+