బాదుడు నీదే.. ఇప్పుడు జిల్లాల యాత్రలేంటి? ఛండాలంగా వేడుకోవటమేంటి? చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు విరుచుకుపడ్డారు. నిత్యం చంద్రబాబును టిడిపిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమంపై సెటైర్లు వేస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న బాదుడే బాదుడు యాత్రలపై విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

జిల్లాల యాత్రలు చేసి సాధించేదేంటి చంద్రబాబు? సాయిరెడ్డి ఫైర్
తాజాగా బాదింది నువ్వు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది నువ్వు అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి. సమయం సందర్భం లేకుండా జిల్లాల యాత్రలు చేసి సాధించేదేమిటి చంద్రబాబూ? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న పొంతన లేని ప్రసంగాలు విని జనం నవ్వుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వాట్సాప్ లో ప్రభుత్వ వ్యతిరేక సందేశాలు పంపండి అని వేడుకోవడం ఏంటి మరీ చంఢాలంగా అని విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

ఏమిటీ చిత్త భ్రమలు చంద్రబాబూ?
నాకౌట్ అంటూ పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి గంజాయి తరలిస్తున్న తెలుగు యువత నేత అరెస్టు, గంజాయి స్మగ్లింగ్ కేసులో టిడిపి మహిళా నేత అరెస్టు అంటూ రెండు పేపర్ క్లిప్పింగులను పోస్ట్ చేసి గంజాయి అమ్మితే అరెస్ట్ చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. సన్మానం చెయ్యాలా ఏంటి.. పిచ్చండీ ఇది అంటూ నాకౌట్ లో టార్గెట్ చేశారు. ఇక మరో పోస్ట్ లో ఏమిటీ చిత్త భ్రమలు చంద్రబాబూ? అంటూ ప్రశ్నించారు. నువ్వేమీ సెలవుపై వెళ్లలేదు. ఎప్పుడంటే అప్పుడొచ్చి ఛార్జి తీసుకోడానికి అంటూ అసహనం వ్యక్తం చేశారు.

చిత్తుగా ఓడించిన ప్రజలు మూడేళ్లకే పిలుస్తున్నట్టు కలగంటున్నావా?
ఐదేళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. ఇప్పుడెంతమంది వెంట ఉన్నారో తెలియదు. చిత్తుగా ఓడించిన ప్రజలు మూడేళ్లకే పిలుస్తున్నట్టు కలగంటున్నావా? అంటూ చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై చేస్తున్న వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇక పొలిటికల్ మిర్చి పేరుతో చేసిన పోస్టులో ప్రభుత్వ బడులను ప్రోత్సహిస్తున్న వైయస్ జగన్ వైయస్ జగన్ గారి కృషివల్ల ఇంగ్లీష్ భాషలో మంచి ప్రావీణ్యం చూపిస్తున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీ అబ్బాయిలా అంతా మొద్దబ్బాయిలు కారు
అందులో ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయిలు అవుతారని చంద్రబాబు పేర్కొన్నట్టు పోస్ట్ చేసి నారాయణ లాంటి ప్రైవేట్ స్కూల్ మాఫియాను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం చదివితే అందరూ మీ అబ్బాయిలా మొద్దబ్బాయిలు కారు అంటూ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. నిత్యం చంద్రబాబు పర్యటన పై అధికార పార్టీని టార్గెట్ చేసిన చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ముందు వరుసలో ఉండే విజయసాయిరెడ్డి చేస్తున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications