వైసీపీ ఆపరేషన్ మంగళగిరి - నారా లోకేష్ పై కొత్త అస్త్రం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా వచ్చే నెల తొలి వారంలో అభ్యర్దుల తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. అటు కాంగ్రెస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వటం ద్వారా ఏపీలో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ ముఖ్య నేతల నియోజవర్గాల పైన వైసీపీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.

మారుతున్న లెక్కలు : ఏపీలో ఎన్నికలు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాలపైన వైసీపీ గురి పెట్టింది. కుప్పంలో 2019 ఎన్నికలు అయిన సమయం నుంచే 2024 ఎన్నికల కోసం వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అక్కడ భరత్ ను పార్టీ అభ్యర్దిగా ప్రకటించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వై నాట్ కుప్పంతో వైసీపీ బరిలోకి దిగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి మూడు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇదే విధంగా హిందూపురం,కుప్పం నియోజకవర్గాలను వైసీపీ సీరియస్ గా తీసుకుంది. హిందూపురంలో ఎన్నికల బాధ్యత లను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

MP Vijaya Sai Reddy begins Operation Mangalagiri to defeat Nara Lokesh in next Elections

ఆర్కే రాజీనామాతో : టీడీపీ నేత నారా లోకేష్ పోటే చేస్తున్న మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగారు. 2019 లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే పార్టీ వీడారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు. అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా గంజి చిరంజీవి పోటీ చేయం దాదాపు ఖాయమైంది. వైసీపీని ఆర్కే వీడటంతో సమన్వయం సమస్య లేకుండా సాయిరెడ్డి పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా..స్థానిక సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 31న మంగళగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.

MP Vijaya Sai Reddy begins Operation Mangalagiri to defeat Nara Lokesh in next Elections

గెలుపు పై ధీమా : వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన ధాఖలాలు ఎక్కడా లేవని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి నారా లోకేష్‌ ఓటమి తధ్యమని అన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనుకబడిన సామాజిక వర్గానికి (చేనేత సామాజిక వర్గం) చెందిన వ్యక్తి పోటీలో నిలుబడుతున్నారని చెప్పారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుంటారని, అలాగే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైయ‌స్ జ‌గ‌న్‌కు మరోమారు ముఖ్యమంత్రి చేస్తారని బలంగా నమ్ముతున్నామని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+