మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ సాయిరెడ్డి సమర్ధతకు సీఎం జగన్ పరీక్ష..!!

ఏపీ ఎన్నికల రాజకీయంలో లెక్కలు మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. టీడీపీ ముఖ్య నేతల నియోజవర్గాల పైన వైసీపీ ఫోకస్ చేసింది. కుప్పం నియోజకవర్గం బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. లోకేష్ పోటీ చేసే మంగళగిరి బాధ్యతలు పార్టీ సీనియర్ నేత విజయ సాయిరెడ్డికి కేటాయించారు. ఈ రెండు స్థానాల్లో గెలుపు ఈ ఇద్దరి సమర్ధతకు పరీక్షగా మారుతోంది. మంగళగిరిలో అభ్యర్ది మార్పు పైన చర్చ మొదలైంది.

వైసీపీ టార్గెట్
కుప్పంలో వైసీపీ అభ్యర్దిగా ఎమ్మెల్సీ భరత్ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అక్కడ వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వై నాట్ 175 కుప్పం నుంచే మొదలు పెట్టాలని పిలుపునిచ్చింది. అక్కడ అభ్యర్దిని ముందుగానే ప్రకటించి మంత్రి పెద్దిరెడ్డికి నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీని వైసీపీ ఓడించింది. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కుప్పం మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ సారి కుప్పంలో ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రతీ మూడు నెలలకోసారి మూడు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పం రాజకీయం హోరా హోరీగా మారుతోంది.

MP Vijaya Sai Reddy clarified on Candidate change in Mangalagiri for next Elections

ఇద్దరు సీనియర్లకు పరీక్ష
ఇక, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి అప్పగించారు. గుంటూరు పార్లమెంట్ ఎన్నికల సమన్యవకర్తగా ప్రత్యేకంగా మంగళగిరి పైన ఫోకస్ చేసారు. అక్కడ 2014లో ఓడినా నారా లోకేష్ ఈ సారి విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. వైసీపీ అభ్యర్దిగా గంజి చిరంజీవి పోటీలో ఉన్నారు. అయితే, మారుతున్న సమీకరణాలతో అక్కడ గంజి చిరంజీవి కొనసాగుతారా, అభ్యర్దిని మారుస్తారా అనే చర్చ మొదలైంది. దీని పైన విజయ సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. పార్టీలో అభ్యర్ధీ విషయంలో అనిశ్చితికి తావులేదని, ఒక వారం రోజుల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని సాయిరెడ్డి చెప్పారు.

గెలుపు దక్కేదెవరికి
మంగళగిరి నియోజకవర్గం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన చేనేత కులానికి చెందిన వ్యక్తి పార్టీ అభ్యర్థిగా ఉంటారని సాయిరెడ్డి స్పష్టం చేసారు. రెండు రోజుల క్రితం గంజి చిరంజీవితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సీఎం జగన్ తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో సమన్వయంతో పని చేసి గెలవాలని సూచించారు. నియోజకవర్గంలో రోడ్లు, కాలువల మరమ్మత్తుల పైన స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని సాయిరెడ్డి హామీ ఇచ్చారు. అటు పెద్దిరెడ్డికి కుప్పం..ఇటు సాయిరెడ్డికి మంగళగిరిలో పార్టీ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. అమరావతి పరిధిలోని నియోజకవర్గం...అందునా లోకేష్ పోటీలో ఉండటంతో మంగళగిరి ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+