చంద్రబాబు బరువు తగ్గలేదు, పెరిగారు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యపై కొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు ఆరోగ్యం పై తాజాగా అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. డీహైడ్రేషన్..వేడి కారణంగా స్కిన్ సంబధిత అలెర్జీ వచ్చినట్లు గుర్తించారు. రాజమండ్రి నుంచి వచ్చిన నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, పార్టీతో పాటుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీని పైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు : చంద్రబాబు ఆరోగ్యం పైన టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అయిదు కిలోలు బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆరోపించారు. దీని పైన వైసీపీ ముఖ్య నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైన ట్వీట్ చేసారు. మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారు.

అచ్చన్నలా ఏ పార్టీ వాళ్ళూ ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదు. కారాగారంలో ఆయనకు ప్రాణహాని ఉందా? లోపల ఆయన హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. మెప్పుకోసం మీరు ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురిచేయకండి. ఇంటి భోజనంతో కూడా వెయిట్ లాస్ ఎలా అయ్యారో మీరే చెప్పాలి...అంటూ పేర్కొన్నారు.టీడీపీ ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గలేదని జైలు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు జైలుకు వచ్చిన సమయంలో 66 కేజీలు ఉండగా, ఇప్పుడు 67 కేజీలకు పెరిగినట్లు వెల్లడించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై : చంద్రబాబు ఉన్న జైలులో ట్యాంకులు క్లీన్ చేయటం లేదని..ఆయన కిడ్నీలకు ప్రమాదం ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జైలు అధికారులు స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ జైలులోనూ ఏసీ లేదని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు..పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేసారు. అవసరమైన సందర్భంగా వైద్యులు స్పందిస్తున్నారని వివరించారు.
టీడీపీ నేతలు వరుసగా చేస్తున్న ఈ ప్రచారం వెనుక దురుద్దేశం ఉందనేది వైసీపీ నేతల వాదన. చంద్రబాబు అరెస్ట్ తరువాత సానుభూతి రాని కారణంగా ఇటువంటి ఎత్తుగడలు వేస్తున్నారని వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు ధైర్యంగా ఉన్నారని చెబుతూ...ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారు. అచ్చన్నలా ఏ పార్టీ వాళ్ళూ ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదు. కారాగారంలో ఆయనకు ప్రాణహాని ఉందా? లోపల ఆయన హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. మెప్పుకోసం మీరు ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురిచేయకండి. ఇంటి భోజనంతో కూడా వెయిట్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2023
వైసీపీ నేతల కౌంటర్ : కొద్ది రోజుల క్రితం ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగింపు సమయంలో చంద్రబాబును జైలులో అందుతున్న సౌకర్యాలు..ఇబ్బందులు గురించి ప్రశ్నించారు. చంద్రబాబు బాగానే ఉందని సమాధానం ఇచ్చిన అంశాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలర్జీ ఉందని చెప్పగానే జైలు అధికారులు చికిత్స అందించారని వెల్లడిస్తున్నారు. ఇక, అటు సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన వాదనలు జరుగుతున్నాయి.
ఇటు, హైకోర్టులో స్కిల్ స్కాంలో బెయిల్ పిటీషన్ పైన ఈ నెల 17న విచారణ జరగనుంది. చంద్రబాబు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ స్పష్టం చేస్తుందని వైసీపీ ముఖ్యనేతలు వివరిస్తున్నారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట టీడీపీ డ్రామాగా కొట్టి పారేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications