ఇండియా కూటమిలోకి టీడీపీ - ఏం జరుగుతోంది..!?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికం అయింది. ఉమ్మడి రాజకీయ పోరాటానికి సిద్ద అయ్యాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన మరిన్ని పార్టీలతో కూటమిగా ఏర్పాటు అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ ఇండియా కూటమిలో భాగస్వామి అంటూ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. కొత్త పొత్తుల లెక్కలు చర్చకు వస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు ఖాయం అవుతున్న సమయంలో బీజేపీ వీరితో కలుస్తుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, పవన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ టీడీపీతో కలవటం తో బీజేపీ వీళ్లతో కలిసి రాజకీయంగా కొనసాగుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. పవన్ మాత్రం బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా..తాను మాత్రం టీడీపీతోనే ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత టీడీపీ, జనసేన, వామపక్షాల పొత్తు ఖాయమనే ప్రచారం ఉంది. ఈ సమయంలోనే మరో కొత్త చర్చ మొదలైంది.

MP Vijayasai Reddy

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఇండియా కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉందంటూ పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణ సమయంలో కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. ఆ విషయాన్ని సాయిరెడ్డి తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇండియా కూటమి సభ్యులు చంద్రబాబు అరెస్ట్ తరువాత స్పందించటం..నారా కుటుంబంతో టచ్ లో ఉండటాన్ని సాయిరెడ్డి గుర్తు చేసారు. అధికారికంగా త్వరలోనే నిర్ణయం ఉంబోతోందని ట్వీట్ చేసారు.

దీంతో, బీజేపీ తో పవన్ దూరం కావటం.. జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వమనే నినాదంలో భాగంగా పొత్తుల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తమ రెండు పార్టీలతో పాటుగా కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఎన్నికల తరువాతనే ఏపీలో పొత్తుపైన స్పష్టత వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లటం మరింత ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+