Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AIకు కొత్త నిర్వచనం చెప్పి మోడీకి కితాబిచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి!!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అనేక విషయాల పైన తనదైన పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూనే, మరోవైపు ఏపీలో నిరు పేద ప్రజలకు అందిస్తున్న అనేక పథకాలపైన తనదైన శైలి లో పోస్ట్ చేస్తున్నారు.

మణిపూర్ అల్లర్ల పైన, ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ పైన కూడా ఆసక్తికర పోస్ట్ లు చేస్తున్నారు.ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అమెరికా పర్యటనలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

vijaysaireddy

ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయం నూటికి నూరుశాతం నిజమని విజయ్ సాయి రెడ్డి అన్నారు. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కావచ్చు అమెరికా ఇండియా మధ్య బంధాలు అయినా కావచ్చు అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రపంచ భవిష్యత్తు అంతా AI పైనే ఆధారపడి ఉందని పేర్కొన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరు గొప్ప నాయకులను ఒకేచోట చూడడం హర్షణీయమని ట్వీట్ చేసారు.

అంతేకాదు ఈరోజు ఢిల్లీలో మణిపూర్ హింస పై అఖిలపక్ష సమావేశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పాల్గొంటారని తాము ప్రధానమంత్రికి మద్దతు అందిస్తున్నామని తెలిపారు. మణిపూర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం, అంతర్గత భద్రతా సమస్యలను అధిగమించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం 1.6 కోట్లు కవర్ చేస్తుందని తెలిపారు. ఏపీలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వంలో దేనికైనా అర్హులని నిర్ధారించడానికి ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వచ్చి వారి పేర్ల నమోదు నుండి నుండి అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందించే వరకూ పనిచేస్తుందని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+