• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు ‘రాడార్’కు ఆ డేటా అందలేదా ..కాగ్ వాతలు మీకు నొప్పెట్టవు, ఈ రహస్యమైనా : విజయసాయి వ్యంగ్యం

|

టీడీపీ అధినేత , మాజీ ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఏ చిన్న అవాక్షం దొరికినా సోషల్ మీడియాలో నిప్పుల వర్షం కురిపిస్తారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తారు. సోహల్ మీడియాలో పలు అంశాలపై స్పందించే విజయసాయి తాజాగా ఏలూరు వింత వ్యాధి , రాష్ట్రంలో పెట్టుబడులు , ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత తాగునీరు అందించే పథకం తదితర అంశాలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు .

 వదలబొమ్మాలీ వదల ... గీతం టార్గెట్ గా బాలయ్య అల్లుడికి చుక్కలు చూపిస్తున్న ఎంపీ విజయసాయి వదలబొమ్మాలీ వదల ... గీతం టార్గెట్ గా బాలయ్య అల్లుడికి చుక్కలు చూపిస్తున్న ఎంపీ విజయసాయి

 జరగబోయే ప్రతిదీ తనకు తెలుసంటాడు చంద్రబాబు .. ఏలూరు వింత వ్యాధి రహస్యం చెప్పు బాబు

జరగబోయే ప్రతిదీ తనకు తెలుసంటాడు చంద్రబాబు .. ఏలూరు వింత వ్యాధి రహస్యం చెప్పు బాబు


ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణాలు బాబు రాడార్ కు ఇంకా అందకపోవడం విచిత్రమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జరగబోయే ప్రతిదీ తనకు తెలుసు అంటాడు చంద్రబాబు. దానికి విరుగుళ్ళు , వ్యాక్సిన్లు తన సలహా ప్రకారమే తయారవుతుంటాయని చెప్పుకుంటారు . కాగ్ వాతలు మీకు ఎలాగూ నొప్పి అనిపించవు ఈ రహస్యమైన బయటకు చెప్పొచ్చు కదా బాబు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు .

వందల కోట్ల దుబారా తో పార్టనర్ షిప్ సమ్మిట్లు, దావోస్ లో రోడ్ షో లు ఇప్పుడు లేవు

వందల కోట్ల దుబారా తో పార్టనర్ షిప్ సమ్మిట్లు, దావోస్ లో రోడ్ షో లు ఇప్పుడు లేవు

ఇప్పటికే చంద్రబాబు ఏలూరు వింత వ్యాధి గురించి , తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం జగన్ కు లేఖ రాశారు. హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని జగన్ కు సూచించారు . ఏలూరు వింత వ్యాధికి గల కారణాలను త్వరగా తేల్చాలని కోరారు. ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. ఇదిలా ఉంటే

ఇదే సమయంలో గతంలో చంద్రబాబురాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెగ హడావిడి చేసేవారని ఎద్దేవా చేశారి విజయశాయి రెడ్డి . చంద్రబాబు తరహాలో వందల కోట్ల దుబారా తో పార్టనర్ షిప్ సమ్మిట్లు, దావోస్ లో రోడ్ షో లు , ప్రచార ఆర్భాటాలు లేవని పేర్కొన్నారు .

వైయస్ జగన్ విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు

వైయస్ జగన్ విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు


వైయస్ జగన్ విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయంటూ విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు . ఆంధ్రప్రదేశ్ లోని యువత ఇకపై ఉపాధి కోసం బయటకు వెళ్లి అవసరమే ఉండదు అంటూ ఆయన తెలిపారు.
ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడుతోంది జగన్ గారి ప్రభుత్వం అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, 700 కోట్లతో ఉద్దానంలోని ఏడు మండలాలకు నీరందించే పథకానికి శ్రీకారం చుట్టినట్లు గా పేర్కొన్నారు.

  Rythu Bandhu: Rythu Bandhu released For 59 lakh farmers | Oneindia telugu
  ఉద్దానంకు రక్షిత తాగునీరు అందించే పథకం , అలాగే విశాఖ - తూర్పు గోదావరి జిల్లాలకు వైఎస్ సర్కార్ మరో వరం

  ఉద్దానంకు రక్షిత తాగునీరు అందించే పథకం , అలాగే విశాఖ - తూర్పు గోదావరి జిల్లాలకు వైఎస్ సర్కార్ మరో వరం

  హిరమండలం రిజర్వాయిర్ నుంచి ఉద్దానంకు మంచినీరు అందించనున్నామని 8 లక్షలమంది వెనుకబడ్డ ప్రజలకు ఇదో సంజీవని అని స్పష్టం చేశారు. దీనివల్ల కలుషిత భూగర్భ జలాల సమస్యే ఉండదు. వాటివల్ల వచ్చే జబ్బులూ ఉండవు అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

  విశాఖ - తూర్పు గోదావరి జిల్లాకు వైఎస్ సర్కార్ మరో వరం అంటూ ఇంకో ట్వీట్ లో తాండవ జలాశయానికి ఏలేరు కాలవ నీరు తెచ్చే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు . 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరం అంటూ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు . 60 ఏళ్ల రైతుల కల సాకారం కాబోతోంది అంటూ ట్వీట్ చేశారు .

  English summary
  Vijaya Sai Reddy targeted and satired on Chandrababu said that Ironically, it is strange that the reasons for the illness of the people in Eluru are not yet on the Babu radar. Chandrababu says he knows everything that is going to happen. It is said that antidotes and vaccines are made according to his advice.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X