లోకేశ్ అనే అజ్ఞాని మూర్ఖుడిని మించి ; పచ్చ పార్టీకి ఏ గతి పట్టించావు బాబు : సాయిరెడ్డి ధ్వజం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పిస్తూ నే ఉన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో టిడిపి నేతలు జగన్ సర్కార్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలకు విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబును, లోకేష్ ను మాత్రం వదలకుండా విమర్శిస్తున్నారు.

లోకేష్ లాంటి ఉన్మాదులను సైకాలజీలో ఏమంటారంటే
ఇక తాజాగా లోకేష్ అనే అజ్ఞాని, మూర్ఖుడు స్థాయికి మించిన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నాడు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఇలాంటి ఉన్మాదులను dunning kruger effect కు లోనైనవారుగా సైకాలజీ అభివర్ణిస్తూ ఉందని విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. వారు ఏమీ తెలియకుండా ప్రపంచాన్ని కాచి వడపోసిన బ్రాంతిలో జీవిస్తున్నారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. పైగా మెడలో stanford ట్యాగ్ ఒకటి అంటూ తనదైన శైలిలో టార్గెట్ చేశారు.

ప్రభుత్వ సలహాదారులపై లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్
ఇక అంతకు ముందు లోకేష్ ను టార్గెట్ చేస్తూ ఎవడబ్బ సొమ్మని నీకు తెలుగు నేర్పించిన టీవీ సీరియల్ రైటర్ కు వీఐపీ లాంఛనాలతో లక్షల ప్రజాధనాన్ని జీత,భత్యాల క్రింద ధారపోశావ్ లోకేశా అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. ఇందులో ప్రజాసేవ ఏమైనా ఉందా అంటూ నిలదీశారు. అలాంటి నువ్వు ప్రభుత్వ సలహాదారుల గురించి మాట్లాడటం ఏమిటి ? దొంగే దొంగ అని అరిచినట్టు అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ సలహాదారుల విషయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు హయాంలోనే దుబారా, అవినీతి, అరాచకాలని సైరా పంచ్
ఇక చంద్రబాబు హయాంలో బల్లికి 3000, ఎలుకకు 10000 అంటూ పాత పేపర్ క్లిప్పింగ్స్ ను, చంద్రబాబు హయాంలో బాబు దుబారా ఖర్చులను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి అవినీతి దుబారా అరాచకం వల్ల అప్పులు పెరిగాయని మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలను చంద్రబాబును ఉద్దేశించే అంటూ సైరా పంచ్ వేశారు. సొంత పార్టీ వాళ్ళే అవినీతి, దుబారా వల్ల అప్పులు పెరిగాయని గుర్తు చేస్తూ ఉంటే బాధగా ఉండదా అండీ అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సాయిరెడ్డి సైరా పంచ్ వేస్తూ పోస్ట్ చేశారు.

పచ్చ పార్టీకి ఏ గతి పట్టించావు బాబు .. సాయిరెడ్డి ధ్వజం
ఇక అంతకు ముందు నాలుగు దశాబ్దాల పచ్చ పార్టీ కి ఏ గతి పట్టించారు బాబు అంటూ, చంద్రబాబు టీడీపీని సర్వనాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. నీ వెనక ఎవరూ లేరని తెలిసి కూడా పెట్రోల్ ధరల పై సైకిల్ ర్యాలీ పిలుపునిచ్చావు చంద్రబాబు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి ఒంగోలులో కార్యకర్తలు దొరక్క సైకిల్ కు మూడు వందల రూపాయలు ఇచ్చి పిల్లల్ని వీధిలోకి తీసుకువచ్చారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు లేరని, పార్టీ ఉనికే లేకుండా పోతుందని పదేపదే విజయసాయి రెడ్డి టీడీపీ మనుగడను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఎవరూ లేక స్టూడెంట్స్ తో సైకిల్ ర్యాలీకి రెడీ అయ్యారని ఇదేం పని అని పోలీసులు పంపేశారని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాట్ ఏ షేమ్ ట్విట్టర్ లో అంటూ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications