వైఎస్ వివేకా అలియాస్ షేక్ మహ్మద్ అక్బర్: రెండో భార్య ఫొటోలు వైరల్

వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని, తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని తెలిపారు.

హైదరాబాద్/అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని, తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని తెలిపారు. ఇవ్వాళ ఆయన హైదరాబాద్ లో సీబీఐ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కీలక విషయాలు పక్కన పెట్టి..

వైఎస్ వివేకా హత్యకేసులో చాలా కీలకమైన విషయాలను పక్కన పెట్టి, చిన్న చిన్న అంశాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని అవినాష్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రెండుసార్లు సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. ఈ రెండు విచారణలకు సంబంధించిన పూర్తి వివరాలు, దీనికి సంబంధించిన హార్డ్ డిస్కులను తమకు సమర్పించాలంటూ హైకోర్టు- సీబీఐ అధికారులను ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు.

2011లో వివాహం..

2011లో వివాహం..

2006 నుంచి వివేకానందరెడ్డికి ఓ యువతితో సంబంధం ఉందని, ఇస్లాం చట్టం ప్రకారం 2011లో పెళ్లి కూడా చేసుకున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఆయన తన పేరును కూడా మార్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకుని ఆ యువతిని పెళ్లాడారని అన్నారు. వివేకానందరెడ్డి- ఆ యువతి ఓ బాబు పుట్టాడని, షేక్ షెహెన్ షా అని పేరు పెట్టారని వివరించారు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా ఆ బాబును ప్రకటించాలనే ఉద్దేశంలో వివేకా ఉన్నారని చెప్పారు.

 ఆస్తి బదలాయింపు..

ఆస్తి బదలాయింపు..


తన ఆస్తిని వివేకానందరెడ్డి తన రెండో భార్య, కుమారుడు షెహెన్ షా పేరు మీదికి బదలాయించేలా నోటరీ చేసిన వీలునామా, కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు. ఈ సమయంలో వివేకాను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశం ఎవరికి ఉందని ప్రశ్నించారు. మర్డర్ ఫర్ గెయిన్.. ఏదో లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడ్డారని అవినాష్ రెడ్డి వివరించారు. ఈ విషయాన్ని తాను కోర్టు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

రూ.8 కోట్లు..

రూ.8 కోట్లు..

ఎనిమిది కోట్ల రూపాయల పంపకాల మీద గొడవలు జరిగాయనే విషయాన్ని అప్రూవర్ స్టేట్ మెంట్ లో ఉందని అవినాష్ రెడ్డి తెలిపారు. ఆ మొత్తాన్ని తానే తీసుకుంటానని వివేకా, చెరి సగం కోసం పట్టుబట్టడం.. ఈ హత్యకు దారి తీసినట్టుగా పొందుపర్చారని అన్నారు. బెంగళూరు ప్రాపర్టీ విషయంలో ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షుల వద్ద సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ నమోదు చేశారని చెప్పారు. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఓ లెటర్ ను ఇన్ని రోజులు దాచి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు

లెటర్ దాచి పెట్టారు.

లెటర్ దాచి పెట్టారు.

వైఎస్ సునీతారెడ్డి భర్త రాజశేఖర్ ఈ లెటర్ ను దాచి పెట్టారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆ లెటర్ లో ఉన్న వివరాలేవీ బయట పెట్టొద్దంటూ సూచించారని, ఈ విషయం పోలీసులకు కూడా తెలియదని అన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు సంఘటన స్థలానికి వెంటనే బయలుదేరి వెళ్లాలని తనను పంపించారని, లెటర్ ఉందనే విషయం కనీసం తనకు కూడా చెప్పలేదని వివరించారు. ఇదంతా కుట్ర కాదా? అని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+