ఎంపిపి కుమారుడి దారుణ హత్య, తెలియని కారణం

తోట శ్రీశైలం మధురానగర్‌లో ఉంటూ స్థానిక ఆర్టీసీ బస్టాండు పక్కన టైలర్‌షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కాగా శ్రీశైలం సోమవారం రాత్రి 11 గంటల సమయంలో షాపూర్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లి ఆ తరువాత హుడా కాలనీ లో ఉండి ఉదయం ఇంటికి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక భాగంలో ఉండే ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు పక్కన శవమై కనిపించాడు.
తలపై మారణాయుధాలతో బలంగా కొట్టిన గుర్తులు ఉన్నాయి. మృతదేహం పూర్తిగా రక్తం మడుగులో పడి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. జాగిలం మృతదేహం పడిఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వరకు వెళ్లి తిరిగి అక్కడికేవచ్చి ఆగిపోయింది.
మృతుడి జేబులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా శంషాబాద్ మధురానగర్‌లో ఉండే శ్రీశైలంగా పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచా రం అందించారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఆర్థికపరమైన కారణాల వల్ల హత్య జరిగిందా ? లేక కుటుంబపరమైన విభేదాల వల్ల జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications