ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?

భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వడగాల్పులు వీస్తు న్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత పెరుగుతుందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూడ బడులు కొనసాగుతున్నాయి. అయితే, బది వదిలే సమయం వేళ ఎండ తీవత్ర విద్యార్ధుల పైన పడుతోంది. దీంతో.. ఇప్పుడు ఒంటి పూట బడుల వేళల మార్పు పైన ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉక్క పోత తీవ్రంగా ఉంటోంది. ఉదయం 8 గంటల తరువాత బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. కాగా, వేసవి ప్రభావం పెరుగుతున్న వేళ ప్రభుత్వం ఒంటిపూట బడులు అమల్లోకి తెచ్చింది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటి పూట బడులు అమలు అవుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజూ ఉదయం 7:45 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్ధులకు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో యథావిధిగా రాగిజావ, మధ్యాహ్నం తరగతులు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించాలని నిర్దేశించింది.

mspta-suggests-govt-to-change-the-half-day-schools-timing-amid-record-temperatures-heat-waves

ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల వినతి

కాగా, ఈ నెల 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఖరారు చేసారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. తెలంగాణ లో ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. ఏపీలో ఈ నెల 18 లేదా 19 తేదీన ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా.. పెరుగుతున్న ఎండ తీవ్రత వేళ ఒంటి పూట బడుల నిర్వహణ వేళల మార్పు పైన ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు అందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 11 గంటల వరకే ఒంటి పూట బడులు నిర్వహించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీలో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్న వేళ విద్యార్ధులు వేడి తీవ్రత తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, వేసవి సెలవులు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఇప్పుడు ఒంటి పూట బడుల వేళలు మార్పు చేస్తుందా.. కొనసాగిస్తుందా అనేది ఈ వినతుల వేళ ప్రభుత్వం అధికారికం గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+