ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లలోనే రిజర్వేషన్లు అమలు చేయాలి: ముద్రగడ మరో డిమాండ్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ మరో డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు. కాపు రిజర్వేషన్లను ప్రస్తుతం జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ల నుంచే అమలు చెయ్యాలని ఆయని డిమాండ్ చేస్తున్నారు.
తన నివాసంలో ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ 2018 మార్చి 31లోగా 9వ షెడ్యుల్లో కాపు రిజర్వేషన్లను పొందపరచాలన్నారు. ఈలోగా కాపులకు రిజర్వేషన్ల ఫలితాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు తన ఉద్యమం కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్ శాతం కూడా పెంచాలని పునరుద్ఘాటించారు.













Click it and Unblock the Notifications