రాజకీయాల్లో మొలతాడు లేని వాడు, పవన్ అక్కడే హీరో - ముద్రగడ..!!
కాపు ఉద్యమ నేత ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ ను టార్గెట్ చేసారు. తాను వైసీపీ వ్యవస్థాపకుల్లో ఒకడినని చెప్పుకొచ్చారు. జగన్ ను సీఎం చేసేందుకు తాను ప్రయత్నం చేస్తానని స్పష్టం చేసారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని..పోటీ చేయమంటే సిద్దమని వెల్లడించారు. తనను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారని..ఇక సహించేది లేదని హెచ్చరించారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
వైసీపీ కోసం పని చేస్తాను : తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ తన లక్ష్యాన్ని స్పష్టం చేసారు. తమ కుటుంబానికి రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందన్నారు. తన పైన సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రావటానికి కాపులు కారణం కాదన్నారు. తాను బేషరతుగానే వైసీపీలో చేరానని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయటానికి తాను వైసీపీ ఎంచుకున్నట్లు వెల్లడించారు. తాను కాపులు, దళితుల కోసం ఉద్యమించానని చెప్పుకొచ్చారు. దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చానన్నారు. తాను ఏ ఉద్యమం చేసిన బీసీలు, దళితులే ముందుడి నడిపించారని వివరించారు. తన వర్గాన్ని..తన మనుషులను కాపాడుకోవటానికి ఏం చేసేందుకైన సిద్దమని స్పష్టం చేసారు.

పవన్ పై కీలక వ్యాఖ్యలు : పవన్ సినిమాల్లో హీరో అయితే నేను రాజకీయాల్లో హీరో అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. సినిమాకు చెందిన ఎన్టీఆర్‌ను ప్రజలు నమ్మారు.. ఇంకా ఏ సినిమా వారిని ప్రజలు నమ్మరన్నారు. కాపు జాతిని చంద్రబాబు అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు తనకు పాఠాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు మీరు చెప్పినట్లు తాను ఎందుకు రాజకీయం చేయాలని ప్రశ్నించారు. తనకు చెప్పడానికి ఆయన ఎవరని నిలదీసారు. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు.

పవన్ సినిమాల్లోనే హీరో : పవన్ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో మాత్రం తానే హీరోనని ముద్రగడ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోను.. సినిమా ఫీల్డ్ లో తాను ముందున్నానని చెప్పుకొచ్చారు. మీరా నాకు పాఠాలు నేర్పేది అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాన వైసీపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా చెప్పుకొచ్చారు. కానీ, కొన్ని శక్తులు తనను సీఎం జగన్‌కు దూరం చేశాయని చెప్పారు. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని. తనను అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ముద్రగడ వెల్లడించారు. ఇక, ఇప్పుడు ముద్రగడ తూర్పు గోదావరిలో రాజకీయంగా ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications