Pawan kalyan చుట్టూ బౌన్సర్లు.. బ్లేడ్ బ్యాచ్ దాడులా.. ముద్రగడ పద్మనాభం చురకలు!!
ఏపీలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలతో, ఒకరిపై ఒకరు మాటల దాడులతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల వైసీపీలో చేరిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్లేడ్ బ్యాచ్ లు .. పవన్ సంచలన ఆరోపణలు
ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన షాకింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ కిరాయి మూకలు జనాలతో కలిసిపోయి తన పైన తన సెక్యూరిటీ సిబ్బంది పైన బ్లేడ్లతో దాడులకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

పవన్ ను టార్గెట్ చేసిన ముద్రగడ
ప్రత్యర్థి పార్టీల పన్నాగాలు తెలుసు కదా అంటూ వైసీపీని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక దీంతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిన ముద్రగడ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ తన దగ్గరకు కూడా రానివ్వరని విమర్శించిన ఆయన, ఎప్పుడూ బౌన్సర్ల మధ్యలో ఉండే పవన్ కళ్యాణ్ దగ్గరకు ఎవరు వెళతారు అంటూ ప్రశ్నించారు.
చుట్టూ బౌన్సర్లు.. దాడులు ఎక్కడ ? పవన్
పవన్ కళ్యాణ్ వద్ద రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారని, చుట్టూ బౌన్సర్ లను పెట్టుకున్న పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్ లు తమపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. పిరికితనంతో, పవన్ చేతకానితనం వల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.
కార్యకర్తలు, జనాలు బ్లేడ్ బ్యాచ్ లా పవన్
ఇక ఇప్పటికే వైసిపి కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పు పడుతుంది. పవన్ కళ్యాణ్ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారని, తన సభలకు వస్తున్న కార్యకర్తలు, జనాలను ఆయన బ్లేడ్ బ్యాచ్ లతో పోలుస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా తీవ్రస్థాయిలో మండిపడుతోంది వైసిపి. ఇది పవన్ కొత్త డ్రామా అంటూ విమర్శలు గుప్పిస్తోంది.












Click it and Unblock the Notifications